Home> బిజినెస్
Advertisement

Flipkart Offer: ఫ్లిప్‌కార్ట్‌లో మరోసారి బంపరాఫర్స్... రూ.60 వేలు విలువ చేసే ఈ వివో స్మార్ట్‌ ఫోన్ కేవలం రూ.36 వేలకే...


Flipkart Mobile Phone Offers: ఫ్లిప్‌కార్ట్‌లో స్మార్ట్ ఫోన్లపై 'బిగ్ బచత్ ధమాల్' సేల్ కింద భారీ డిస్కౌంట్ ఆఫర్స్, ఎక్స్‌చేంజ్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. 

Flipkart Offer: ఫ్లిప్‌కార్ట్‌లో మరోసారి బంపరాఫర్స్... రూ.60 వేలు విలువ చేసే ఈ వివో స్మార్ట్‌ ఫోన్ కేవలం రూ.36 వేలకే...

Flipkart Smart Phone Offers: ప్రముఖ ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ మరోసారి 'బిగ్ బచత్ ధమాల్ సేల్' ప్రకటించింది. ఈ నెల 3 నుంచి 5వ తేదీ వరకు ఈ సేల్ ఉంటుంది. ఇందులో భాగంగా స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ టీవీలు తదితర ఎలక్ట్రానిక్ వస్తువులపై భారీ తగ్గింపు అందిస్తోంది. అతిచౌక ధరలో స్మార్ట్ ఫోన్లు, టీవీలు కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది బెస్ట్ ఆఫర్ అని చెప్పొచ్చు. ఈ ఆఫర్‌లో భాగంగా రూ.59,999 విలువ చేసే వివో ఎక్స్80 (కాస్మిక్ బ్లాక్, 128 జీబీ) స్మార్ట్ ఫోన్‌ను అతి చౌక ధరకే కస్టమర్లకు అందిస్తోంది. బిగ్ బచత్ సేల్ ఆఫర్‌లో ఈ ఫోన్‌ని కేవలం రూ.36వేలకే మీ సొంతం చేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం... 

ఫ్లిప్‌కార్ట్ డిస్కౌంట్ :

వివో ఎక్స్80 (కాస్మిక్ బ్లాక్, 128 జీబీ)  సాధారణ ధర రూ.59,999. కానీ ఫ్లిప్‌కార్ట్‌లో 8 శాతం డిస్కౌంట్‌తో రూ.54,499కే అందుబాటులో ఉంది. ఈ ఫోన్ కొనుగోలుకు హెచ్‌డీఎఫ్‌సీ డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డు వాడినట్లయితే మరో రూ.3500 వరకు తక్షణ తగ్గింపు లభిస్తుంది. అప్పుడు రూ.51,999కే ఈ ఫోన్‌ని మీ సొంతం చేసుకోవచ్చు.

ఎక్స్‌చేంజ్ ఆఫర్‌తో కేవలం రూ.36వేలకే :

వివో ఎక్స్80 (కాస్మిక్ బ్లాక్, 128 జీబీ)  స్మార్ట్ ఫోన్‌పై బిగ్ బచత్ ధమాల్ సేల్‌లో ఎక్స్‌చేంజ్ ఆఫర్ అందుబాటులో ఉంది. ఎక్స్‌చేంజ్ ఆఫర్ కింద రూ.14,500 వరకు తగ్గింపు లభిస్తుంది. ఇందుకోసం మీ పాత ఫోన్‌ని ఎక్స్‌చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. రూ.54,499కి అందుబాటులో ఉన్న ఈ ఫోన్ ఎక్స్‌చేంజ్ ఆఫర్ ద్వారా రూ.40,999కే లభిస్తుంది. ఒకవేళ హెచ్‌డీఎఫ్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డుతో రూ.3500 డిస్కౌంట్ కూడా పొందినట్లయితే... రూ.36,999కే ఈ ఫోన్‌ను మీ సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్‌పై ఎక్స్‌ట్రా డిస్కౌంట్ ఆఫర్ కింద మరో రూ.5వేల వరకు తగ్గింపు అందుబాటులో ఉంది. అది కూడా వర్తించినట్లయితే ఫోన్ ధర మరింత తగ్గుతుంది. అయితే డిస్కౌంట్ ఆఫర్స్‌కు, ఎక్స్‌చేంజ్ ఆఫర్‌కు షరతులు వర్తిస్తాయని గుర్తుంచుకోండి. 

Also Read: Telangana Formation Day: నేడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం.. స్వరాష్ట్ర కల సాకారమై ఎనిమిది వసంతాలు పూర్తి... 

Also Read: Horoscope Today June 2nd 2022: నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారికి జీవిత భాగస్వామి లేదా లవ్‌మేట్‌తో విభేదాలు...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Read More