Home> బిజినెస్
Advertisement

PPO Number: పెన్షన్ పేమెంట్ ఆర్డర్ నెంబర్ అంటే ఏమిటి, ఆన్‌లైన్‌లో ఎలా పొందవచ్చు

PPO Number: ఎంప్లాయిస్ ప్రోవిడెంట్ ఫండ్ గురించి అందరికీ తెలిసిందే. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులందరికీ పీఎఫ్ ఎక్కౌంట్ అనేది సర్వ సాధారణం. అయితే మీ పీఎఫ్ డబ్బులు పొందాలంటే 12 అంకెల ఆ నెంబర్ అత్యంత కీలకం. ఆ నెంబర్ లేకుంటే మీ పీఎఫ్ డబ్బులు చేతికి అందవు. 

PPO Number: పెన్షన్ పేమెంట్ ఆర్డర్ నెంబర్ అంటే ఏమిటి, ఆన్‌లైన్‌లో ఎలా పొందవచ్చు

PPO Number: ప్రతి ఉద్యోగి రిటైర్మెంట్ తరువాత ఈపీఎఫ్‌లో డిపాజిట్ అయిన డబ్బుల్ని డ్రా చేస్తుంటారు. ఈపీఎఫ్ఓ కార్యాలయం ప్రతి ఉద్యోగికి 12 అంకెల నెంబర్ జారీ చేస్తుంటుంది. దీనినే పీపీఓ నెంబర్ అంటారు. అంటే పెన్షన్ పేమెంట్ ఆర్డర్ నెంబర్. ఇదొక యూనిక్ నెంబర్. ఈ నెంబర్‌ను బట్టి ఆ ఉద్యోగి పూర్తి వివరాలు తెలిసిపోతాయి. అందుకే ఈ నెంబర్ అంత కీలకం కానుంది. 

పెన్షన్ పొందాలన్నా, పీఎఫ్ డబ్బులు డ్రా చేయాలన్నా పెన్షన్ పేమెంట్ ఆర్డర్ నెంబర్ చాలా అవసరం. ఒకవేళ ఈ నెంబర్ పోతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. తిరిగి ఆన్‌లైన్ ప్రక్రియ ద్వారా ఆ నెంబర్ పొందవచ్చు. దీనికోసం ఈపీఎఫ్ఓ అధికారిక వెబ్‌సైట్ epfo.gov.in.ఓపెన్ చేయాలి. ఆన్‌లైన్ సర్వీసెస్ క్లిక్ చేసి పెన్షన్ పోర్టల్ ఓపెన్ చేయాలి. ఇందులో పీపీఓ నెంబర్ సెలెక్ట్ చేయాలి. పీఎఫ్ ఎక్కౌంట్ నెంబర్, బ్యాంక్ ఎక్కౌంట్ నెంబర్ వంటి వివరాలు నమోదు చేస్తే చాలా స్క్రీన్‌పై మీ పీపీఓ నెంబర్ కన్పిస్తుంది. 

పీపీఓ నెంబర్ కోసం ఈపీఎఫ్ఓకు చెందిన ఉమంగ్ యాప్ నుంచి కూడా పొందవచ్చు. సర్వీసెస్ ఆప్షన్ క్లిక్ చేసి, పీపీఓ నెంబర్ ఆప్షన్ ఎంచుకోవాలి. ఇప్పుడు మీ పీఎఫ్ ఎక్కౌంట్ నెంబర్, బ్యాంక్ ఎక్కౌంట్ నెంబర్ ఎంటర్ చేస్తే చాలు మీ పెన్షన్ పేమెంట్ ఆర్డర్ నెంబర్ డిస్‌ప్లే అవుతుంది. అంతేకాకుండా రిజిస్టర్ మొబైల్ నెంబర్ నుంచి టోల్ ఫ్రీ నెంబర్ 1800118005 కు ఫోన్ చేసి కూడా తెలుసుకోవచ్చు. పీపీవో నెంబర్ ఇతర వివరాలు ఎవరితోనూ షేర్ చేసుకోవద్దు. 

పీపీఓ నెంబర్ ఆధారంగా పెన్షన్ పేమెంట్ స్టేటస్ కూడా పొందవచ్చు. మీ పెన్షన్‌కు సంబంధించిన పేమెంట్ స్లిప్ కూడా తీసుకోవచ్చు. పెన్షన్‌కు సంబంధించి తలెత్తే చాలా సమస్యలను పీపీఓ నెంబర్ పరిష్కరిస్తుంది. 

Also read: Male Menopause: పురుషుల్లో కూడా మెనోపాజ్ ఉంటుందా, ఎలాంటి లక్షణాలుంటాయి<

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More