Home> బిజినెస్
Advertisement

EPFO: ఈపీఎఫ్ బ్యాలెన్స్‌ను UMANG Appలో ఈజీగా చెక్ చేసుకోండి

How To Check EPF Balance Using UMANG App: ఆరు కోట్ల మంది ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు ఈపీఎఫ్ ఖాతాలు ఉన్నాయి. వీరికి ఇటీవల కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. 2019-20 ఏడాదికి సంబంధించిన వడ్డీని ఈపీఎఫ్ ఖాతాలలో జమ చేశారు. వాస్తవానికి నవంబర్ కానుకగా ఈపీఎఫ్ ఖాతాదారులకు వడ్డీని అందించాల్సి ఉంది.

EPFO: ఈపీఎఫ్ బ్యాలెన్స్‌ను UMANG Appలో ఈజీగా చెక్ చేసుకోండి

How To Check EPF Balance Using UMANG App: ఆరు కోట్ల మంది ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు ఈపీఎఫ్ ఖాతాలు ఉన్నాయి. వీరికి ఇటీవల కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. 2019-20 ఏడాదికి సంబంధించిన వడ్డీని ఈపీఎఫ్ ఖాతాలలో జమ చేశారు. వాస్తవానికి నవంబర్ కానుకగా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్(EPFO), కేంద్ర ప్రభుత్వం ఈపీఎఫ్ ఖాతాదారులకు వడ్డీని అందించాల్సి ఉంది.

ఈపీఎఫ్ ఖాతాదారులకు మొత్తం 8.5శాతం వడ్డీని తొలుత రెండు దఫాలుగా ఇవ్వాలనుకున్నారు. అనంతరం నిర్ణయాన్ని మార్చుకుని ఒకే దఫాలో ఇటీవల పీఎఫ్ ఖాతాల్లో జమ చేశారు. ఈపీఎఫ్ఓ(EPFO) పీఎఫ్ ఖాతాల్లో జమ అయిన వడ్డీ వివరాలను, పీఎఫ్ బ్యాలెన్స్‌ను ఉమాంగ్ యాప్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. 

Also Read : ​Benifits Of EPF Account: మీకు ఈపీఎఫ్ అకౌంట్ ఉందా.. ఈ బెనిఫిట్స్ తెలుసా!

UMANG Appలో ఈపీఎఫ్ ఖాతా వివరాలు ఇలా తెలుసుకోవచ్చు..
- పీఎఫ్ ఖాతాదారుడు మొదట UMANG App ఓపెన్ చేయండి

- తర్వాత ఈపీఎఫ్ఓ మీద క్లిక్ చేయండి

- Employee Centric Services మీద క్లిక్ చేయాలి

- View Passbook ఆప్షన్‌ను క్లిక్ చేయండి

- మీ UAN నెంబర్, పాస్‌వర్డ్ ఎంటర్ చేయండి

- పీఎఫ్ ఖాతాకు మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది

- ఓటీపీ కన్ఫామ్ చేసిన తర్వాత మీరు ఈపీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు

Also Read : PF Balance Missed Call Number: పీఎఫ్ బ్యాలెన్స్ ఇలా తెలుసుకోవచ్చు.. ఒక్క మిస్డ్ కాల్ చాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More