Home> బిజినెస్
Advertisement

EPF Account link: మీ బ్యాంక్ ఎక్కౌంట్‌ను పీఎఫ్ ఎక్కౌంట్‌తో లింక్ చేయడం ఎలా

EPF Account link: ప్రతి ఉద్యోగికి పీఎఫ్ ఎక్కౌంట్ అనేది తప్పనిసరి. ప్రతి నెలా జీతంలోంచి కొంతభాగం, మరి కొంతభాగం కంపెనీ నుంచి ఈపీఎఫ్ ఎక్కౌంట్‌కు చేరుతుంటుంది. అయితే పీఎఫ్ ఎక్కౌంట్ కలిగిన ప్రతి ఉద్యోగి తమ ఈపీఎఫ్ ఎక్కౌంట్‌ను బ్యాంక్ ఎక్కౌంట్‌తో లింక్ చేసుకోవడం చాలా అవసరం.

EPF Account link: మీ బ్యాంక్ ఎక్కౌంట్‌ను పీఎఫ్ ఎక్కౌంట్‌తో లింక్ చేయడం ఎలా

EPF Account link: ప్రభుత్వ ఉద్యోగి అయినా లేదా ప్రైవేట్ ఉద్యోగి అయినా రిటైర్ అయ్యేవరకూ పీఎఫ్ కొనసాగుతుంది. రిటైర్ అయినప్పుడు ఒకేసారి పెద్దమొత్తంలో అందే నగదు భవిష్యత్తులో పనిచేస్తుంది. అయితే బ్యాంక్ ఎక్కౌంట్-పీఎఫ్ ఎక్కౌంట్ లింకింగ్ తప్పకుండా ఉండాలి. ఈ లింకింగ్‌ను ఆన్‌లైన్‌లో ఇంట్లో కూర్చుని కూడా చేసుకోవచ్చు. 

ప్రతి ఉద్యోగి ఈపీఎఫ్‌లో జమ అయ్యే పీఎఫ్ నగదుపై కేంద్ర ప్రభుత్వం 8.25 శాతం వడ్డీ చెల్లిస్తుంటుంది. ఇది ప్రతి త్రైమాసికానికి మారుతుంటుంది. సదరు ఉద్యోగం వదిలిపెట్టిన తరువాత ఆ ఉద్యోగి పీఎఫ్ విత్‌డ్రా చేసుకోవచ్చు లేదా మరో కంపెనీలో చేరాక అందులోకి బదిలీ చేసుకోవచ్చు. పీఎఫ్ డబ్బులు విత్ డ్రా చేసుకుంటే నేరుగా ఆ డబ్బు మీరు లింక్ చేసిన బ్యాంక్ ఎక్కౌంట్లో పడుతుంది. ఒకవేళ లింక్ అయిన బ్యాంక్ ఎక్కౌంట్ క్లోజ్ అయుంటే..మరో బ్యాంక్ ఎక్కౌంట్ ఓపెన్ చేసి దానికి లింక్ చేసుకోవచ్చు. ఈ లింకింగ్ ప్రక్రియ కూడా చాలా సులభం. పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. 

ముందుగా ఈపీఎఫ్ఓ పోర్టల్ ఓపెన్ చేయాలి. ఇప్పుడు మీ యూఏఎన్ నెంబర్, క్యాప్చా ఎంటర్ చేయడం ద్వారా లాగిన్ కావాలి. తరువాత మేనేజ్ ట్యాబ్ క్లిక్ చేసి కేవైసీపై క్లిక్ చేయాలి. కేవైసీ పూర్తయ్యాక మీ బ్యాంకు ఎంచుకోవాలి. మీ ఎక్కౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్‌సి కోడ్ ఎంటర్ చేయాలి. తరువాత సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఆ తరువాత ఈ సమాచారం మీ హెచ్‌ఆర్‌కు చేరి అక్కడ్నించి ఆమోదం పొందుతుంది. ఒకసారి ఆమోదం పొందిందంటే ఇక పీఎఫ్ ఎక్కౌంట్ లింక్ అయినట్టే.

Also read: PPO Number: పెన్షన్ పేమెంట్ ఆర్డర్ నెంబర్ అంటే ఏమిటి, ఆన్‌లైన్‌లో ఎలా పొందవచ్చు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More