Home> బిజినెస్
Advertisement

ఆఫీసులో కుసుకు తీయొచ్చు....వినూత్న నిర్ణయం తీసుకున్న సంస్థ

ఆఫీసులో కుసుకు తీయొచ్చు....వినూత్న నిర్ణయం తీసుకున్న సంస్థ

Afternoon sleep పని...పని...పని ఎక్కడ పని చూసినా ఇదే గోల. ఎంత సేపు ఎంత పని చేశావు అని అడిగే సంస్థలే కాని ఎంత సంపాదించావు అని అడిగే సంస్థలు లేవు. ఎంత సేపు నీ వల్ల లాకేంటి లాభం అని అడిగే సంస్థలు కాని ... నా వల్ల నీకేంటి లాభం అని అడిగే సంస్థలు లేవు. దీంతో ఉద్యోగులు పని చేసి .. చేసి అలసిపోతున్నారు. అయితే ఈ ట్రెండ్‌కు చరమగీతం పాడుతూ ఓ సంస్థ వినూత్న నిర్ణయం తీసుకుంది. ఆలసిపోయిన ఉద్యోగులు ఎంచక్కా ఆఫీస్ టైమింగ్స్‌లో కునుకు తీయొచ్చని చెప్పింది.

 

మారుతున్న జీవన విధానంతో ఉద్యోగుల శక్తి సామర్థ్యాలు సన్నగిళ్లుతున్నాయి. దీన్ని గమనించిన పలు సంస్థలు ఉద్యోగులతో పాటు ఇటు సంస్థలు రెండింటి శ్రేయస్కరం కోసం  హైబ్రిడ్‌ పని విధానానికి జైకొడుతున్నాయి.వర్క్ ఫ్రం హోం, హైబ్రీడ్ పని విధానానం కంటే మరో ముందు అడుగు వేసింది బెంగళూరుకు చెందిన ఓ ఐటీ కంపెనీ. ఉద్యోగుల శ్రేయస్సు కోసం వినూత్న నిర్ణయం తీసుకుంది. వర్గింగ్ అవర్స్‌లో ఓ అరగంట పాటు కునుకు తీసేందుకు అవకాశం కల్పించింది.

పరుపుల తయారీ బిజినెస్‌ చేస్తున్న బెంగళూరుకు చెందిన వేక్‌ఫిట్‌ సంస్థ మెరుగైన పనితీరుతో మంచి ఫలితాలు సాధిస్తోంది. సంస్థ లాభాల కోసం ఉరుకులు పరుగుల మీద పని చేసిన సిబ్బంది ఇప్పుడు వయోభారంతో కుంగిపోతున్నారు. మునుపటిలా పరుగులు తీయలేకపోతున్నారు. దీన్ని గమించిన ఫౌండర్‌ చైతన్య రామలింగేగౌడ నినూత్న నిర్ణయం తీసుకున్నారు.  హార్వర్డ్‌ యూనివర్సిటీలో చదువుకుని నాసాలో పనిచేసిన అనుభవం ఉండడంతో సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. నాసా పరిశోధనల మేరకు మధ్యాహ్నం పూట  25 నిమిషాల పాటు చిన్న కునుకు తీస్తే రెట్టించిన ఉత్సాహం వస్తుందని ఆయన గ్రహించారు. ఈ ఉత్సాహంతో  ఉద్యోగుల పని సామర్థ్యం ఏకంగా 33 శాతం పెరుగుతుందని పలు అధ్యయనాల్లో కూడా తేలడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. మధ్యాహ్నం పూట కనుకు తీస్తే ఒత్తిడి కూడా తగ్గుతుందని తద్వారా పని సారమ్త్యం పెరుగుతుందని నిర్దారణ కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. దీంతో ప్రతీ రోజు మధ్యాహ్నం 2:00 గంటల నుంచి 2:30 గంటల వరకు ఉద్యోగులకు కునుకు తీసేందుకు అవకాశం కల్పించింది సంస్థ. ఈ మేరకు సంస్థలో పనిచేసే ఉద్యోగులు మెయిల్స్‌ కూడా పంపారు. ఒక్కసారిగా మధ్యాహ్నం నిద్రకు అనుమతి రావడంతో ఉద్యోగులు ఉబ్బితబ్బిబ్బి అవుతున్నారు. మిగతా సంస్థలు కూడా మార్గాన్ని అనుసరించి ఉద్యోగుల పనిసామర్థ్యాన్ని పెంచాలని కోరుకుంటున్నారు.

alsor read ఉద్యోగులను ఆశ్చర్యచకితులను చేస్తూ ఆఫర్లు ఇస్తున్న సాఫ్ట్‌వేర్ సంస్థ

also read అమెరికాలో అత్యంత గరిష్ట స్థాయికి వడ్డీ రేటు.... ఆటో రుణాలు, క్రెడిట్ కార్డులపై భారీగా ఛార్జీలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

 

Apple Link - https://apple.co/3loQYe 

 

Read More