Home> బిజినెస్
Advertisement

Fine on Amazon: అమెజాన్ ఇండియా సీసీఐ షాక్​- రూ.200 కోట్లు ఫైన్​

Fine on Amazon: అమెజాన్​ ఇండియా-ఫ్యూచర్ రిటైల్ గ్రూప్​ మధ్య ఒప్పందానికి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) అనుమతి రద్దు చేసింది. దీనితో పాటు అమెజాన్​కు రూ.200 కోట్లకుపైగా జరిమానా విధించింది.

Fine on Amazon: అమెజాన్ ఇండియా సీసీఐ షాక్​- రూ.200 కోట్లు ఫైన్​

Fine on Amazon: ఈ-కామర్స్​ దిగ్గజం అమెజాన్​కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఫ్యూచర్ కూపన్స్​తో ఒప్పంద వివాదం మరో కీలక మలుపు తిరిగింది. ఈ ఒప్పందానికి 2019లో ఇచ్చిన అనుమతులను రద్దు చేస్తూ.. కాంపిటీషన్​ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఆదేశాలు జారీ (CCI suspends Amazon's deal with Futur Group) చేసింది. దీనితో పాటు నిబంధనల ఉల్లంఘనకు గానూ.. రూ.202 కోట్ల ఫైన్ వేసింది.

కిశోర్​ బియానీకి చెందిన ఫ్యూచర్​ గ్రూప్​తో.. ముకేశ్​ అంబానీకి చెందిన రిలయన్స్ రిటైల్ (Reliance retail) రూ.24,713 కోట్ల​ ఒప్పందాన్ని.. సవాలు చేస్తు అమెజాన్ న్యాయపోరాటం చేస్తున్న తరుణంలోనే సీసీఐ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

ఇంతకీ వివాదం ఏమిటంటే..

ఫ్యూచర్​ గ్రూప్​కు చెందిన.. ఫ్యూచర్ కూపన్స్​ ప్రైవేట్​ లిమిటెడ్​ (ఎఫ్​సీపీఎల్​)లో 49 శాతం వాటను కొనుగోలు చేసేందుకు రూ.1,400తో ఒప్పందం కుదుర్చుకోవాలని నిర్ణయించింది అమెజాన్​.

నిర్ణీత వాటాలకన్నా ఎక్కువ మొత్తంలో కొనుగోలుకోసం సీసీఐ (CCI on Amazon deal with future grop) అనుమతులు తప్పనిసరి. ఈ నేపథ్యంలో అమెజాన్ సీసీఐని ఆశ్రయించగా ఇందుకు ఆమోదం లభించింది. అయితే ఈ అనుమతుల కోసం చేసుకున్న దరఖాస్తులో కీలక సమాచార దాచిపెట్టినట్లు సీసీఐ ఆరోపిస్తోంది. ఈ కారణంగానే ఒప్పందాన్ని రద్దు చేస్తూ.. పెనాల్టీ కూడా విధించినట్లు తెలిపింది.

ఈ వివాదం నేపథ్యంలో సరైన ఆధారాలతో తమను సంప్రదించాలని సీసీఐ అమెజాన్​ను ఆదేశించింది. ఇందుకు 60 రోజుల గడువు విధించింది.

Also read: SBI: ఎస్​బీఐ రుణాలు మరింత భారం- బేస్​ రేటు 10 బేసిస్​ పాయింట్లు పెంపు!

Also read: UberEats: స్పేస్​లోకి పుడ్ డెలివరీ చేసిన తొలి సంస్థగా 'ఉబర్ ఈట్స్'..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More