Home> బిజినెస్
Advertisement

BSNL Promotional Offer: ఈ రీఛార్జ్ ప్లాన్‌తో డబుల్ డేటా, మరిన్ని ప్రయోజనాలు

 ప్రభుత్వ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగం లిమిటెడ్(BSNL) తన వినియోగదారులకు భారీ ఆఫర్ అందించింది. సరికొత్త ప్లాన్‌ను తీసుకువచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్ వినియోగదారులకు ఇంటర్నెట్ డబుల్ డేటా అందిస్తుంది. ఆ ప్లాన్ వివరాలు మీకోసం..

BSNL Promotional Offer: ఈ రీఛార్జ్ ప్లాన్‌తో డబుల్ డేటా, మరిన్ని ప్రయోజనాలు

BSNL Mithram Plus Plan: ప్రభుత్వ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగం లిమిటెడ్(BSNL) తన వినియోగదారులకు భారీ ఆఫర్ అందించింది. సరికొత్త ప్లాన్‌ను తీసుకువచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్ వినియోగదారులకు ఇంటర్నెట్ డబుల్ డేటా అందిస్తుంది. ఆ ప్లాన్ వివరాలు మీకోసం..

మిత్రమ్ ప్లస్ ప్లాన్‌ (Mithram Plus Plan)లో బెస్ట్ ఆఫర్..
బీఎస్ఎన్ఎల్(BSNL) అత్యంత ప్రజాదరణ పొందిన రీఛార్జ్ ప్లాన్లను అందిస్తోంది. ఈ క్రమంలో మిత్రమ్ ప్లస్ ప్లాన్‌ను ప్రభుత్వం టెలికాం కంపెనీ తీసుకొచ్చింది. టెక్ సైట్ కేరళాటెలికాం ప్రకారం, బీఎస్ఎన్ఎల్ రూ .109 ప్రిపెయిడ్ ప్లాన్ తెచ్చింది. దీని ద్వారా మీకు రెట్టింపు ప్రయోజనాలు లభిస్తాయి.

Also Read: Gold Price Today: బులియన్ మార్కెట్‌లో నేటి బంగారం ధరలు, పెరుగుతున్న Silver Price

30కి బదులుగా 75 రోజులు ఆఫర్..
బీఎస్ఎన్ఎల్ అందిస్తున్న 109 రూపాయల మిత్రమ్ ప్లస్ ప్లాన్ వ్యాలిడిటీ పొడిగించారు. గతంలో 30 రోజులుగా ఉన్న వ్యాలిడిటీని ప్రస్తుతం 75 రోజులకు పెంచారు. అంటే ఇది డబుల్ కాదు, రెండున్నర రెట్ల వ్యాలిడిటీని తన వినియోగదారులకు  BSNL అందిస్తుంది.

5 GB డేటాకి బదులుగా రెట్టింపు డేటా..
రూ.109తో రీఛార్జ్ చేసుకున్న బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు ఇంటర్నెట్(Internet) డేటా రెట్టింపు అవుతుంది. గతంలో ఈ ప్లాన్‌లో 5GB డేటాను మాత్రమే ఇచ్చేది. ప్రస్తుతం ఈ ప్లాన్ ద్వారా బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు 10 GB డేటాను తీసుకొచ్చింది.

Also Read: Cheapest Recharge Plans: రూ.100 కన్నా తక్కువ ధరలో బెస్ట్ రీఛార్జ్ ప్లాన్ అందిస్తున్న ఎయిర్‌టెల్, జియో మరియు Vi

అపరిమిత కాలింగ్ (Unlimited Calling)..
బీఎస్ఎన్ఎల్ ఇటీవలే తన అన్ని రీఛార్జ్ ప్లాన్లలో అపరిమిత కాలింగ్ సదుపాయాన్ని ప్రారంభించింది. రూ.109 ప్లాన్ కింద అపరిమిత కాలింగ్ సదుపాయాన్ని పొందుతారు. అయితే, 10 జీబీ ప్రమోషనల్ ఆఫర్ వ్యాలిడిటీ 20 రోజులు అని బీఎస్ఎన్ఎల్ స్పష్టం చేసింది.

ఏప్రిల్ 1..
బీఎస్ఎన్ఎల్ తీసుకొచ్చిన ప్రమోషనల్ ఆఫర్ మిత్రామ్ ప్లస్ ప్లాన్ ఈ ఏడాది ఏప్రిల్ 1 నుండి నిలిపివేయనున్నారు. అయితే దీనిపై బీఎస్ఎన్ఎల్  ఎటువంటి ప్రకటన చేయలేదు.

Also Read: EPFO: 40 లక్షల మంది EPF ఖాతాదారులకు ఈపీఎఫ్ఓ షాకింగ్ న్యూస్ 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More