Home> బిజినెస్
Advertisement

BSNL Latest Offers: బీఎస్‌ఎన్‌ఎల్‌ బంపర్ ఆఫర్.. అన్‌లిమిటెడ్ కాల్స్, డైలీ 2 జీబీ డేటా.. 150 రోజుల వ్యాలిడిటీ..!

BSNL New Recharge Plans: జియో, ఎయిర్‌టెల్‌ నుంచి పోటీని తట్టుకునేందుకు బీఎస్‌ఎన్‌ఎల్‌ సరికొత్త ఆఫర్లను సరిచయం చేస్తోంది. తాజాగా రూ.397 ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. అన్‌లిమిటెడ్ కాల్స్‌తోపాటు డైలీ 2 జీబీ డేటా అందిస్తోంది. వివరాలు ఇలా.. 
 

BSNL Latest Offers: బీఎస్‌ఎన్‌ఎల్‌ బంపర్ ఆఫర్.. అన్‌లిమిటెడ్ కాల్స్, డైలీ 2 జీబీ డేటా.. 150 రోజుల వ్యాలిడిటీ..!

BSNL New Recharge Plans: తమ వినియోగదారులను ఆకర్షించేందుకు బీఎస్‌ఎన్ఎల్‌ సరికొత్త ప్లాన్‌లను అందుబాటులోకి తీసుకువస్తోంది. జియో, ఎయిర్‌టెల్‌లకు దీటుగా ఆఫర్లను ప్రకటిస్తోంది.ఇతర టెలికాం కంపెనీల మాదిరిగానే.. బీఎస్‌ఎన్‌ఎల్ కూడా ఒక నెల నుంచి 365 రోజుల వరకు రకరకాల ప్లాన్‌లను అందిస్తోంది. లాంగ్ వాలిడిటీ ప్లాన్ కోసం చూస్తున్నవారికి తాజాగా గుడ్‌న్యూస్ చెప్పింది. 150 రోజుల సుదీర్ఘ వ్యాలిడిటీ ప్లాన్‌ను కస్టమర్లకు అందుబాటులోకి తీసుకువచ్చింది. 

ఇతర టెలికాం ఆపరేటర్ల నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకుని నిలబడేందుకు బీఎస్ఎన్ఎల్ ప్రయత్నిస్తోంది. ఎప్పటికప్పుడు కొత్త రీఛార్జ్ ప్లాన్‌లను పరిచయం చేస్తోంది. టెలికాం రంగంలో తిరిగి పుంజుకునేందుకు ఆఫర్లను తీసుకువస్తోంది. కొత్త రీఛార్జ్ ప్లాన్‌లను తీసుకువస్తూనే.. పాత ప్లాన్‌లను కూడా అప్‌డేట్ చేసి ఆకర్షిస్తోంది. తన ప్లాన్‌లతో ఇతర కంపెనీలకు గట్టి పోటీనిస్తోంది. అన్‌లిమిటెడ్ కాలింగ్‌తో 5 నెలల సుదీర్ఘ వ్యాలిడిటీని అందించే ప్లాన్‌ను కస్టమర్లకు పరిచయం చేసింది. 

బీఎస్‌ఎన్‌ 397 రూపాయల ప్లాన్‌ను ప్రకటించింది. దీర్ఘకాలం చెల్లుబాటుతో పాటు అపరిమిత కాలింగ్ లభిస్తుంది. ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే.. 150 రోజుల పాటు ఎలాంటి టెన్షన్ లేకుండా యాక్టివ్‌గా ఉంచుకోవచ్చు. ఈ ప్లాన్‌లో వినియోగదారులు అపరిమిత వాయిస్ కాలింగ్ సౌకర్యాన్ని పొందుతారు. అయితే 30 రోజుల పాటు మాత్రమే అన్‌లిమిటెడ్ కాల్స్ సౌకర్యం ఉంటుంది. మొత్తం 150 రోజుల వరకు సిమ్ యాక్టివ్‌గా ఉటుంది. మీరు 30 రోజుల తర్వాత రీఛార్జ్ చేయకపోయినా.. ఇన్‌కమింగ్ కాల్స్, మెసేజ్‌లు వస్తాయి. 

రూ.397 ప్లాన్‌తో 30 రోజుల పాటు అన్‌లిమిటెడ్ కాలింగ్‌తోపాటు ప్రతిరోజూ 2 జీబీ డేటాను కూడా అందిస్తోంది. రోజువారీ డేటా లిమిట్ ముగిసిన తరువాత.. మీరు 40Kbps వేగంతో డేటాను ఉపయోగించే అవకాశం ఉంటుంది. బీఎస్‌ఎన్‌ఎల్ ప్రతిరోజూ 100 ఎస్‌ఎంఎస్‌ల సౌకర్యాన్ని ఒక నెల పాటు కల్పిస్తోంది. 

Also Read: JC Prabhakar Reddy: ఆ రోజు ఉరి వేసుకుందామనుకున్నా.. సంచలన విషయాలు బయటపెట్టిన జేసీ ప్రభాకర్ రెడ్డి  

Also Read: Weather Updates Today: రాష్ట్రంలో రేపు భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Read More