Home> బిజినెస్
Advertisement

Best SUV Under @ Rs 6 Lakhs: టాటా పంచ్ నచ్చకపోతే.. ఈ చౌకైన ఎస్‌యూవీని కోనేయండి! తక్కువ ధర.. ఎక్కువ మైలేజ్

Nissan Magnite 2023 Get @6 Lakhs Only టాటా పంచ్‌కు పోటీగా మరో ఎస్‌యూవీ అందుబాటులో ఉంది. కస్టమర్లకు టాటా పంచ్ నచ్చకపోతే.. ఈ చౌకైన ఎస్‌యూవీని కళ్లుమూసుకుని కొనేసుకోవచ్చు.

Best SUV Under @ Rs 6 Lakhs: టాటా పంచ్ నచ్చకపోతే.. ఈ చౌకైన ఎస్‌యూవీని కోనేయండి! తక్కువ ధర.. ఎక్కువ మైలేజ్

Get Nissan Magnite 2023 @Rs 6 Lakhs Only: భారతీయ కార్ మార్కెట్లో సరసమైన ఎస్‌యూవీలకు డిమాండ్ రోజురోజుకీ పెరుగుతోంది. ప్రస్తుతం టాటా మోటార్స్ కంపెనీకి చెందిన 'టాటా పంచ్‌'కు విపరీతమైన ఆదరణ ఉంది. అయినప్పటికీ టాటా పంచ్‌కు పోటీగా మరో ఎస్‌యూవీ అందుబాటులో ఉంది. కస్టమర్లకు టాటా పంచ్ నచ్చకపోతే.. ఈ చౌకైన ఎస్‌యూవీని కళ్లుమూసుకుని కొనేసుకోవచ్చు. ఈ కారు ధర 6 లక్షలు కాగా.. మైలేజ్ ఎక్కువ కూడా బాగుంటుంది. ఈ కారు వివరాలు ఓసారి చూద్దాం. 

పైన చెప్పిన ఎస్‌యూవీ కారు మరేదో కాదు 'నిస్సాన్ మాగ్నైట్'. టాటా పంచ్‌, నిస్సాన్ మాగ్నైట్ కార్ల ధర దాదాపు సమానంగా ఉంటుంది. అయితే నిస్సాన్ మాగ్నైట్.. టాటా పంచ్ కంటే పెద్దదిగా ఉండడమే కాకుండా అదనపు ఫీచర్లను కలిగి ఉంటుంది. నిస్సాన్ మాగ్నైట్ ఐదు ట్రిమ్‌లలో (XE, XL, XV ఎగ్జిక్యూటివ్, XV మరియు XV ప్రీమియం) అందుబాటులో ఉంది. ఈ కారు 3 డ్యూయల్-టోన్ మరియు 5 మోనోటోన్ షేడ్స్‌లో విక్రయించబడుతోంది. 

నిస్సాన్ మాగ్నైట్ కారులో 5 మంది కూర్చోవచ్చు. బూట్ స్పేస్ కెపాసిటీ 336 లీటర్లు. నిస్సాన్ మాగ్నైట్ ధర రూ. 6 లక్షల నుంచి రూ. 10.94 లక్షల (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) వరకు ఉంది. నిస్సాన్ మాగ్నైట్‌లో 360-డిగ్రీ కెమెరా, ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లేతో కూడిన 8.0-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది. ఎయిర్ ప్యూరిఫైయర్, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జర్, యాంబియంట్ లైటింగ్ మరియు క్రూయిజ్ కంట్రోల్ వంటి అనేక ఫీచర్లు ఉన్నాయి. ప్రయాణీకుల భద్రత కోసం డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, పార్కింగ్ సెన్సార్లు, EBDతో కూడిన ABS మరియు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటివి ఉన్నాయి.

నిస్సాన్ మాగ్నైట్ రెండు పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌లతో అందుబాటులో ఉంది. మొదటి ఎంపిక 72PS పవర్ మరియు 96Nm టార్క్ ఉత్పత్తి చేసే 1.0L సహజంగా ఆశించిన పెట్రోల్ ఇంజన్. రెండోది 1.0L టర్బో పెట్రోల్ ఇంజన్. ఇది 100PS పవర్ మరియు 160Nm టార్క్/100PS మరియు 152Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. మాగ్నైట్ పెట్రోల్ మాన్యువల్ లీటరుకు 20 కిమీ మైలేజీని, పెట్రోల్ ఆటోమేటిక్ 17.7 కిమీ మైలేజీని అందిస్తుంది.

Also Read: Best Jio Recharge 2023: చౌకైన జియో ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌.. 149కే అద్భుత ప్రయోజనాలు! ప్రతిరోజూ 1 GB డేటా  

Also Read: Rajat Patidar Ruled Out: రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుకు భారీ షాక్.. ఐపీఎల్ 2023 నుంచి స్టార్ ప్లేయర్ ఔట్!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Read More