Home> బిజినెస్
Advertisement

Best Selling Sedan Car: బ్రెజా, పంచ్, క్రెటా లాంటి ఎస్‌యూవీలను కాకుండా.. ఈ చౌకైన సెడాన్‌ను ఎగబడి కొంటున్నారు!

Best Selling 2022 Sedan Car is Maruti Dzire. సెడాన్ కార్లలో మారుతి సుజుకి డిజైర్ మాత్రమే టాప్-10 కార్లలో తన స్థానాన్ని నిలుపుకోగలిగింది. టాప్-10 బెస్ట్ సెల్లింగ్ కార్ల జాబితాలో మరే సెడాన్ కారు లేదు. 
 

Best Selling Sedan Car: బ్రెజా, పంచ్, క్రెటా లాంటి ఎస్‌యూవీలను కాకుండా.. ఈ చౌకైన సెడాన్‌ను ఎగబడి కొంటున్నారు!

Best Sedan Cars 2022, Maruti Dzire is Best Selling Sedan Car in 2022: గత కొన్ని సంవత్సరాలుగా మిడ్ సైజ్ సెడాన్ కార్ మార్కెట్ తగ్గుతూ వస్తోంది. అయితే ఓ సెడాన్ కార్ మార్కెట్ మాత్రం స్థిరంగా ఉంది. అదే 'మారుతి డిజైర్' సెడాన్ కార్. మారుతి డిజైర్ సెడాన్ కార్ అమ్మకాల పరంగా పలు ఎస్‌యూవీ కార్లను కూడా అధిగమించింది. ఇటీవలి  సంవత్సరాలలో ఎస్‌యూవీ కార్లకు డిమాండ్ బాగా పెరిగింది. వినియోగదారులు కొత్త ఎస్‌యూవీ స్టైల్ కార్లను కొనుగోలు చేయాలని చూస్తున్నారు. అయినా కూడా మారుతి డిజైర్ బాగా అమ్ముడవుతోంది.

సెడాన్ కార్లలో మారుతి సుజుకి డిజైర్ మాత్రమే టాప్-10 కార్లలో తన స్థానాన్ని నిలుపుకోగలిగింది. టాప్-10 బెస్ట్ సెల్లింగ్ కార్ల జాబితాలో మరే సెడాన్ కారు లేదు. గతేడాది అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో డిజైర్ ఐదవ స్థానంలో ఉంది. మారుతి బాలెనో (16,932 యూనిట్లు), మారుతి ఎర్టిగా (12,273 యూనిట్లు), మారుతి స్విఫ్ట్ (12,061 యూనిట్లు), టాటా నెక్సాన్ (12,053 యూనిట్లు) మాత్రమే డిజైర్ కంటే ముందు ఉన్నాయి. 

అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో మారుతి సుజుకి డిజైర్ తర్వాత మారుతి బ్రెజా (11,200 యూనిట్లు), టాటా పంచ్ (10,586 యూనిట్లు), మారుతి ఈకో (10,581 యూనిట్లు), హ్యుందాయ్ క్రెటా (10,205 యూనిట్లు) మరియు మారుతి వ్యాగన్ఆర్ (10,181 యూనిట్లు) ఉన్నాయి. మారుతి సుజుకి డిజైర్ అత్యధికంగా అమ్ముడకాడానికి కారణాలు చాలానే ఉన్నాయి. డిజైర్ ధర రూ. 6.24 లక్షల నుంచి రూ. 9.18 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉండడం ప్రధాన కారణం. 

మారుతి సుజుకి డిజైర్ కారులో 5 సీట్ల కారులో 1.2-లీటర్ డ్యూయల్‌జెట్ పెట్రోల్ ఇంజన్ (90 PS మరియు 113 Nm) ఉంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్‌ని ప్రామాణికంగా పొందుతుంది. అయితే 5-స్పీడ్ AMT గేర్‌బాక్స్ ఒక ఎంపిక. డిజైర్‌లో CNG కిట్ కూడా ఉంటుంది. CNGలో ఇంజిన్ 77 PS మరియు 98.5 Nm లను ఉత్పత్తి చేస్తుంది. డిజైర్ CNG కేవలం 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. ఈ కారు మైలేజ్ పెట్రోల్‌పై 24.12 kmpl, CNGలో 31.12 kmpl వరకు ఉంటుంది.

Also Read: Jio Best Recharge Offer: జియో రూ. 61 రీఛార్జ్ ప్లాన్.. ఈ ప్లాన్‌కి ఎయిర్‌టెల్, వీఐ, బీఎస్‌ఎన్‌ఎల్‌ కూడా భయపడుతున్నాయి!

Also Read: Best SUV in India: మహీంద్రా మాత్రమే ఇలాంటి ఆఫర్ ఇవ్వగలదు.. మారుతి బ్రీజా ధరలో మహీంద్రా ఎక్స్‌యూవీ 700 కార్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.

 

Read More