Home> బిజినెస్
Advertisement

Investment plan: నెలకు వేయి రూపాయల పెట్టుబడితో..2 కోట్ల ఆదాయం, ఎలాగంటే

Investment plan: స్మాల్ సేవింగ్ లేదా స్మాల్ ఇన్వెస్ట్‌మెంట్స్ అనేవి చాలా కీలకపాత్ర పోషిస్తాయి. తక్కువ పెట్టుబడితో అధికంగా సంపాదించే అవకాశాలుంటాయి. వేయి రూపాయల పెట్టుబడితో 2 కోట్ల వరకూ ఆర్జించే అవకాశం..

Investment plan: నెలకు వేయి రూపాయల పెట్టుబడితో..2 కోట్ల ఆదాయం, ఎలాగంటే

Investment plan: స్మాల్ సేవింగ్ లేదా స్మాల్ ఇన్వెస్ట్‌మెంట్స్ అనేవి చాలా కీలకపాత్ర పోషిస్తాయి. తక్కువ పెట్టుబడితో అధికంగా సంపాదించే అవకాశాలుంటాయి. వేయి రూపాయల పెట్టుబడితో 2 కోట్ల వరకూ ఆర్జించే అవకాశం..

రోజురోజుకూ పెరుగుతున్న కాస్ట్ ఆఫ్ లివింగ్ నేపధ్యంలో సురక్షితమైన పెట్టుబడి అనేది చాలా అవసరం. పెట్టుబడి పెట్టేందుకు నిర్ణీత సమయం లేదా పరిమితి ఉండదు. ఎప్పుడైనా ప్రారంభించవచ్చు. ఇప్పటివరకూ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్స్  ప్రారంభించకపోతే..దీపావళి పురస్కరించుకుని పెట్టుబడి పెట్టండి. అనతికాలంలో కోటీశ్వరులు కావచ్చు..

చిన్న చిన్న ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్స్ ద్వారా ఎక్కువ మొత్తంలో నిధులు సమీకరించవచ్చు. కేవలం వేయి రూపాయలతో కూడా మీరు పెట్టుబడి ప్రారంభించవచ్చు. ఇందుకు ఉపయోగపడేది మ్యూచ్యువల్ ఫండ్స్. వేయి రూపాయల ఎస్ఐపీతో ప్రారంభిస్తే..కోటీశ్వరులయ్యేందుకు మార్గం సుగమమౌతుంది. నెలకు వేయి రూపాయలు మ్యూచ్యువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెడితే మంచి ఫలితాలుంటాయి. గత కొద్దికాలంగా మ్యూచ్యువల్ ఫండ్స్ 20 శాతం కంటే ఎక్కువ రిటర్న్స్ అందించాయి.

20 ఏళ్లకు ఇన్వెస్ట్‌మెంట్

నెలకు వేయి రూపాయల చొప్పున 20 ఏళ్లపాటు పెట్టుబడి పెడితే..మీరు జమ చేసే మొత్తం 2.4 లక్షల రూపాయలవుతుంది. 20 ఏళ్లలో ఏడాదికి 15 శాతం రిటర్న్ చొప్పున 15 లక్షల 16 వేల రూపాయలౌతుంది. ఈ 20 శాతం రిటర్న్ ఏడాదికి ఉంటుంది. అంటే మొత్తం 31.61 లక్షల రూపాయలౌతుంది. 

30 ఏళ్లకు ఇన్వెస్ట్‌మెంట్

ప్రతి నెలా వేయి రూపాయల చొప్పున 25 ఏళ్లపాటు పెట్టుబడి పెడితే 20 శాతం రిటర్న్ లభిస్తుంది. అంటే మెచ్యూరిటీ ఫండ్ మొత్తం 86.27 లక్షలౌతుంది. అదే విధంగా 30 ఏళ్లకు పెంచితే..20 శాతం రిటర్న్ చొప్పున 2 కోట్ల 33 లక్షల 60 వేలు అవుతుంది. మ్యూచ్యువల్ ఫండ్స్‌లో ఇన్వెస్టర్లకు కాంపౌండింగ్ ప్రయోజనం కలుగుతుంది. చిన్నగా పెట్టుబడి పెట్టినా పెద్దమొత్తంలో ఫండ్ సమీకరించవచ్చు.

Also read: Insta new Feature: ఇన్‌స్టాలో కొత్త ఫీచర్, ఇక స్టోరీ అప్‌లోడ్ మరింత ఈజీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More