Home> బిజినెస్
Advertisement

Cheapest Honda City Cars: రూ. 5.33 లక్షలకే హోండా సిటీ కారు.. పెట్రోల్ ఇంజిన్‌తో పాటు సీఎన్‌జీ ఆప్షన్ కూడా!

Honda City S MT and Honda City SV MT cars available under 5 Lakhs. Cars24లో సూపర్ కార్స్ అందుబాటులో ఉన్నాయి. తక్కువ ధరలో సెకండ్ హ్యాండ్ హోండా సిటీ కార్ల జాబితాను ఇప్పుడు చూద్దాం. 
 

Cheapest Honda City Cars: రూ. 5.33 లక్షలకే హోండా సిటీ కారు.. పెట్రోల్ ఇంజిన్‌తో పాటు సీఎన్‌జీ ఆప్షన్ కూడా!

Best Second Hand Honda City Cars under 5 Lakhs in Cars24: 'హోండా సిటీ' కారుకు భారత దేశంలో ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. ముఖ్యంగా హోండా సిటీ సెడాన్ కార్లకు. అయితే ఇప్పుడు కొంతమందికి ఈ కారు కాస్త ఖరీదైనదిగా అనిపించవచ్చు. మీరు ఈ జాబితాలో ఉంటే.. ఏమాత్రం ఆందోళన అవసర లేదు. సరసమైన ధర, మంచి ఇంజిన్ కండిషన్ ఉన్న హోండా సిటీ సెకండ్ హ్యాండ్ కార్స్ మార్కెట్లో ఎన్నో అందుబాటులో ఉన్నాయి. సెకండ్ హ్యాండ్ కార్లను కొనుగోలు చేయడానికి లేదా విక్రయించడానికి ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్ అయిన Cars24లో సూపర్ కార్స్ అందుబాటులో ఉన్నాయి. తక్కువ ధరలో సెకండ్ హ్యాండ్ హోండా సిటీ కార్ల జాబితాను ఇప్పుడు చూద్దాం. 

Honda City S MT:
2013 హోండా సిటీ S MT మోడల్ హోండా సిటీ కారు Cars24లో అందుబాటులో ఉంది. దీని ధర రూ. 5,33,000. ఇప్పటివరకు ఈ కారు 45,386 కిమీ నడించింది. ఇది పెట్రోల్ ఇంజిన్‌తో పాటు CNGతో కూడా నడుస్తుంది. ఈ కారు 2013 నుంచి ఒక్కరే వాడుతున్నారు. ఈ కారు నోయిడాలో అమ్మకానికి అందుబాటులో ఉంది.

Honda City SV MT:
2014 హోండా సిటీ SV MT మోడల్ కూడా తక్కువ ధరలో ఉంది. ఈ కారు ధర రూ.5,48,000. ఈ కార్ రీడింగ్ 60,214 కిమీ. ఇది పెట్రోల్ ఇంజిన్‌తో నడుస్తుంది. ఈ కారు ఫస్ట్ ఓనర్.. నోయిడాలో అమ్మకానికి అందుబాటులో ఉంచాడు. నేరుగా వెళితే ధర తగ్గే అవకాశం ఉంది.  

Honda City V MT:
2015 హోండా సిటీ V MT కూడా Cars24లో అమ్మకానికి ఉంది. ఈ కారు ధర రూ.6,23,000. ఇది ఇప్పటివరకు 63,007 కిమీ నడించింది. ఇది పెట్రోల్ ఇంజిన్‌తో నడుస్తుంది. ఈ కారు రెండవ యజమాని నోయిడాలో అమ్మకానికి అందుబాటులో ఉంచాడు. 

Honda City VX CVT:
2014 హోండా సిటీ VX CVT కారు తక్కువ ధరలో ఉంది. ఈ కారు ధర రూ.6,71,000. ఈ కారు రీడింగ్ 82,622 కిలోమీటర్లు. ఇది పెట్రోల్ ఇంజిన్‌తో నడుస్తుంది. ఈ కారు మొదటి యజమాని నోయిడాలో అమ్మకానికి పెట్టాడు. 

Also Read: SRH Squad IPL 2023: నలుగురు మంచి ప్లేయర్లను పట్టిన కావ్య పాప.. సన్‌రైజర్స్ హైదరాబాద్ పూర్తి జట్టు ఇదే!  

Also Read: చెన్నై జట్టులోకి బెన్ స్టోక్స్‌.. ఇక ఎంఎస్ ధోనీ ఉంటాడా! సీఎస్‌కే సీఈఓ ఏమన్నాడంటే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.

Read More