Home> బిజినెస్
Advertisement

Best Electric Cars : దేశంలో అందుబాటులో ఉన్న టాప్ 5 బెస్ట్ ఎలక్ట్రిక్ కార్లు, వాటి ధరలు

Best Electric Cars : ఇంధన ధరలు రోజురోజుకూ పెరిగిపోతుండటం ఆందోళన కల్గిస్తుందా. కొత్త కారు కొనాలనే ఆలోచనను పక్కనబెడుతుందా. అదే కారణమైతే..మీరు కొనుగోలు చేయడానికి టాప్ 5 ఎలక్ట్రికల్ కార్ల వివరాలను మీ కోసం అందిస్తున్నాం.
 

Best Electric Cars : దేశంలో అందుబాటులో ఉన్న టాప్ 5 బెస్ట్ ఎలక్ట్రిక్ కార్లు, వాటి ధరలు

Best Electric Cars : ఇంధన ధరలు రోజురోజుకూ పెరిగిపోతుండటం ఆందోళన కల్గిస్తుందా. కొత్త కారు కొనాలనే ఆలోచనను పక్కనబెడుతుందా. అదే కారణమైతే..మీరు కొనుగోలు చేయడానికి టాప్ 5 ఎలక్ట్రికల్ కార్ల వివరాలను మీ కోసం అందిస్తున్నాం.

దేశంలో ఇంధన ధరలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. అటు పెట్రోల్, ఇటు డీజిల్ రెండూ పెరిగిపోతుండటంతో కొత్త కారు కొనుగోలు చేయాలనుకునేవారికి కాస్త ఇబ్బంది ఎదురవుతోంది. పెట్రోల్, డీజిల్ ధరలకు భయపడి ఆ ఆలోచనను పక్కనబెడుతున్నవారున్నారు. ఈ నేపధ్యంలో 
ఎలక్ట్రికల్ వాహనాలు ఒక్కటే పరిష్కారం కాగలవు. భారతీయ వినియోగదారులకు ఎలక్ట్రిక్ వాహనాలే (Electric Cars) మంచి ప్రత్యామ్నాయం కాగలవు. మీకు ఒకవేళ ఎలక్ట్రిక్ కారు కొనాలనే ఆలోచన ఉంటే..చిన్న, మీడియం, హై రేంజ్ ఎలక్ట్రిక్ కార్ల గురించి వివరాలు అందిస్తున్నాం.

Tata Tigor EV : ఇండియాలో బెస్ట్ ఎలక్ట్రిక్ కారు ఇది. దేశంలో ప్రస్తుతం ఇదే అత్యంత చవకగా లభిస్తున్న ఎలక్ట్రిక్ కారు. కంపెనీ చెబుతున్న దాని ప్రకారం ఒకసారి రీఛార్జ్ చేస్తే 213 కిలోమీటర్ల ప్రయాణిస్తుంది. ఇందులో ఉన్న బ్యాటరీ ఛార్జింగ్‌కు 12 గంటల సమయం పడుతుంది. అదే డీసీ ఫాస్ట్ ఛార్జర్ తీసుకుంటే 2 గంటల సమయం పడుతుంది. ఈ కారు 12-13 లక్షల మధ్యలో లభిస్తుంది.

Tata Nexon : టాటా కంపెనీకే చెందిన మరో ఎలక్ట్రిక్ కారు ఇది. మధ్య స్థాయి ఎస్‌యవీ. ఈ కారు ఒకసారి ఛార్జ్ చేశాక..313 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఈ కారు ధర 14 లక్షల వరకూ ఉంటుంది. 

MG ZS EV : ప్రముఖ కార్ల కంపెనీ ఎంజీ అందిస్తున్న కారు ఇది. ఇటీవలే ఎంజీ కంపెనీ ఎస్‌యూవీ ప్రవేశపెట్టింది. కంపెనీ ప్రకారం ఒకసారి ఛార్జ్ చేశాక..419 కిలోమీటర్ల ప్రయాణిస్తుంది. ఈ కారు ధర 21 లక్షల నుంచి 25 లక్షల వరకూ ఉంటుంది. ధర ఎక్కువగా ఉన్నా..కారులో ఫీచర్లు అద్భుతంగా ఉంటాయి.

Hyundai Kona : టాప్ ఎలక్ట్రిక్ కార్లతో ఇదొకటి. హ్యూండయ్ కంపెనీ అందిస్తున్న ఈవీ కారు. ఎంజీ ఈవీ కారుతో పోలిస్తే బ్యాటరీ చిన్నదిగా ఉన్నా..ఒకసారి ఛార్జ్ చేశాక 452 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఈ కారు ధర దేశంలో 33.79 లక్షల వరకూ ఉంటుంది. 

Mercedes Benz EQC : లగ్జరీ ఎలక్ట్రిక్ కారు గురించి ఎదురు చూస్తుంటే మెర్సిడెస్ బెంజ్ ఈక్యూసీ మంచి కారు. ఇదొక ప్రీమియం లగ్జరీ కారు. దీని ధర 1. 24 కోట్ల వరకూ ఉంటుంది. ఒకసారి రీఛార్జ్ చేశాక..414 కిలోమీటర్ల వరకూ ప్రయాణిస్తుంది

Also read: Todays Gold Rate: దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Read More