Home> బిజినెస్
Advertisement

November Bank Holidays: నవంబర్ నెలలో 10 రోజుల బ్యాంకులకు సెలవు, ఎక్కడ, ఎప్పుడు

November Bank Holidays: మరో వారం రోజుల్లో నవంబర్ నెల ప్రారంభం కానుంది. మీకు ఆ నెలలో బ్యాంకు పనులుంటే..ఈ అప్‌డేట్ మీ కోసమే. ఆ నెలలో బ్యాంకులు 10 రోజులు సెలవులున్నాయి.

November Bank Holidays: నవంబర్ నెలలో 10 రోజుల బ్యాంకులకు సెలవు, ఎక్కడ, ఎప్పుడు

ఆన్‌లైన్ లావాదేవీలు ఓ వైపు పెరుగుతున్నా..నిత్యం ఏదో పనిపై బ్యాంకులకు వెళ్లాల్సిన అవసరం ఉండనే ఉంటోంది. బ్యాంకులకు సెలవులుంటే ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు నవంబర్ నెల సెలవుల జాబితా వచ్చేసింది.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నవంబర్ నెలలో బ్యాంకు సెలవులు జాబితాను జారీ చేసింది. ఆ నెలలో 10 రోజులు బ్యాంకు సెలవులున్నాయి. ఒకవేళ నవంబర్ నెలలో మీకు బ్యాంకు పనులుంటే..ఈ సెలవుల ప్రకారం ప్లానింగ్ చేసుకుంటే మంచిది. లేకుంటే ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హాలిడే లిస్ట్ మూడు విభాగాలుగా ఉంటుంది. ఇందులో నెగోషియెబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్, రియల్ టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ హాలిడే, బ్యాంక్స్ క్లోజింగ్ ఎక్కౌంట్స్ ఉన్నాయి. పబ్లిక్ హాలిడేస్ కాకుండా రీజనల్ హాలిడేస్ కూడా ఉన్నాయి. మరోవైపు ఆదివారాలతో పాటు రెండవ, నాలుగవ శనివారాలున్నాయి. నవంబర్ నెలలో ఏయే రోజులు, ఎక్కడెక్కడ బ్యాంకు సెలవులున్నాయో చూద్దాం..

నవంబర్ 1         కర్ణాటక ఆవిర్భావ దినోత్సవం, బెంగళూరు, ఇంఫాల్‌లో సెలవు
నవంబర్ 6         ఆదివారం
నవంబర్ 8         గురునానక్ జయంతి, కార్తీక పౌర్ణమి..అగర్తల, బెంగళూరు, గ్యాంగ్‌టక్, గౌహతి, ఇంఫాల్, కోచి, పాణాజి, పాట్నా, షిల్లాంగ్, తిరువనంతపురంలో సెలవు
నవంబర్ 11       కనకదాస జయంతి-వంగల పండుగ..బెంగళూరు, షిల్లాంగ్‌లో సెలవు
నవంబర్ 12       రెండవ శనివారం
నవంబర్ 12       ఆదివారం
నవంబర్ 20       ఆదివారం
నవంబర్ 23      సేంగ్ పండుగ..షిల్లాంగ్‌లో సెలవు
నవంబర్ 26       నాలుగవ శనివారం
నవంబర్ 27       ఆదివారం

Also read: Gold Price Today: పసిడి ప్రియులకు కాస్త ఊరట... స్థిరంగా బంగారం, వెండి ధరలు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More