Home> బిజినెస్
Advertisement

Bank Holidays in October: వచ్చే 15 రోజులు బ్యాంకులు బంద్.. పూర్తి సెలవుల జాబితా ఇదే..!

Bank Holiday October 2023: అక్టోబర్‌ నెలలో 15 రోజులు బ్యాంకులు బంద్ కానున్నాయి. వివిధ రాష్ట్రాల్లో పండుగల కారణంగా ఆయా రోజుల్లో సెలవులు ప్రకటించారు. ఏయే రోజుల్లో బ్యాంకులకు హాలీడేస్ ఉన్నాయో ఇక్కడ తెలుసుకోండి..
 

Bank Holidays in October: వచ్చే 15 రోజులు బ్యాంకులు బంద్.. పూర్తి సెలవుల జాబితా ఇదే..!

Bank Holiday October 2023: సెప్టెంబర్ నెల ముగిసేందుకు మరో ఐదు రోజుల సమయం మాత్రం ఉంది. అక్టోబర్ నెల ప్రారంభంకానుంది. ప్రతి నెలలో బ్యాంకు సెలవులు ఉన్నట్లే.. అక్టోబర్‌లో కూడా బ్యాంకులకు హాలీడేస్ ఉన్నాయి. వివిధ పండుగలు, ఆది, శనివారాలతో కలుపుకుంటే.. దాదాపు 15 రోజులు బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. వినియోగదారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసేందుకు.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెలవుల జాబితాను ముందుగానే విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. గాంధీ జయంతి, నవరాత్రి, దసరా కారణంగా అక్టోబర్‌లో చాలా రోజులు బంద్ కానున్నాయి. 

అక్టోబర్ నెలలో శని, ఆదివారాలు సెలవులతో కలిపి మొత్తం 15 రోజుల పాటు బ్యాంకులు మూతపడతాయి. ప్రభుత్వ రంగమే కాకుండా ప్రైవేట్ సెక్టార్, ప్రాంతీయ బ్యాంకులకు కూడా 15 రోజులు సెలవులు ఉంటాయి. మీకు వచ్చే నెలలో బ్యాంకులకు సంబంధించిన పనులు ఉంటే.. సెలవుల జాబితాను చూసుకుని వెళ్లండి. లేకపోతే తీరా బ్యాంక్‌కు వెళ్లిన తరువాత అక్కడ క్లోజ్‌గా ఉంటే నిరాశగా వెనక్కి తిరిగి రావాల్సి ఉంటుంది.

సెలవుల జాబితా ఇలా..

==> అక్టోబర్ 1- ఆదివారం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్
==> అక్టోబర్ 2- గాంధీ జయంతి కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
==> అక్టోబర్ 8- ఆదివారం బ్యాంకులకు సెలవు 
==> అక్టోబర్ 14- మహాలయ కారణంగా కోల్‌కతాలో, రెండవ శనివారం దేశవ్యాప్తంగా బ్యాంకులకు హాలీడే
==> అక్టోబర్ 15- ఆదివారం బ్యాంకులకు సెలవు
==> అక్టోబర్ 18- కటి బిహు కారణంగా గౌహతిలో బ్యాంకులకు హాలీడే
==> అక్టోబర్ 21- దుర్గాపూజ/మహా సప్తమి కారణంగా, అగర్తల, గౌహతి, ఇంఫాల్, కోల్‌కతాలోని బ్యాంకులకు సెలవు
==> అక్టోబర్ 22 - ఆదివారం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు   
==> అక్టోబర్ 24- దసరా కారణంగా హైదరాబాద్, ఇంఫాల్ మినహా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
==> అక్టోబర్ 25- దుర్గాపూజ (దసాయి) కారణంగా గాంగ్‌టక్‌లో బ్యాంకులు క్లోజ్
==> అక్టోబరు 26- దుర్గాపూజ (దసాయి)/ప్రవేశ దినం గ్యాంగ్‌టక్, జమ్మూ-శ్రీనగర్‌లలో బ్యాంకులకు హాలీడే
==> అక్టోబర్ 27- దుర్గాపూజ (దసాయి) రోజున గాంగ్‌టక్‌లో బ్యాంకులు మూసివేత
==> అక్టోబర్ 28- లక్ష్మీ పూజ, నాల్గో శనివారం కారణంగా కోల్‌కతాతో సహా దేశం మొత్తం బ్యాంకులకు సెలవు.
==> అక్టోబర్ 29- ఆదివారం బ్యాంకులకు సెలవు
==> అక్టోబర్ 31- సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా అహ్మదాబాద్‌లోని బ్యాంకులకు సెలవు

ఆన్‌లైన్ సేవలు 

==> యూపీఐ, మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వంటి డిజిటల్ సేవలపై బ్యాంకు సెలవుల ప్రభావం ఉండదు.
==> క్యాష్ విత్ డ్రా కోసం ఏటీఏంను ఉపయోగించవచ్చు. యూపీఐ ద్వారా కూడా డబ్బును ట్రాన్స్‌ఫర్ చేయవచ్చు.
==> నెట్ బ్యాంకింగ్, ఏటీఎం, డిజిటల్ చెల్లింపుల ద్వారా కూడా బ్యాంకింగ్‌కు సంబంధించిన పనులు చేసుకోవచ్చు.
==> నెట్ బ్యాంకింగ్ లేదా మొబైల్ బ్యాంకింగ్ ద్వారా ఒక అకౌంట్‌ నుంచి మరో అకౌంట్‌కు క్యాష్‌ ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు.

Also Read: Chandrababu Case Updates: క్వాష్ పిటీషన్‌పై చంద్రబాబుకు ఊరట, రేపు విచారణకు లిస్టింగ్

Also Read: Oppo Reno 10 5G Price: ఫ్లిఫ్‌కార్ట్‌లో OPPO Reno10 5G మొబైల్‌పై స్పెషల్‌ డీల్‌..రూ. 9,900కే పొందండి..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Read More