Home> బిజినెస్
Advertisement

iPhone SE 3: యాపిల్ నుంచి బడ్జెట్ 5జీ ఫోన్- ధర, ఫీచర్ల వివరాలివే..!

iPhone SE 3: యాపిల్ బడ్జెట్​ ఐఫోన్ మోడల్​ ఎస్​ఈలో కొత్త వేరియంట్​ త్వరలోనే విడుదల కానుంది. ఈ ఫోన్​ ధర, ఫీచర్లు ఇతర ప్రత్యేకతలు ఇలా ఉన్నాయి.

iPhone SE 3: యాపిల్ నుంచి బడ్జెట్ 5జీ ఫోన్- ధర, ఫీచర్ల వివరాలివే..!

iPhone SE 3: బడ్జెట్​ ధరలో యాపిల్​ ఐఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్​. బఢ్జెట్ సెగ్మెంట్​లో యాపిల్ విడుదల చేసే ఎస్​ఈ ఫోన్లలో కొత్త మోడల్​ విడుదలపై కసరత్తు జరుగతోంది. ఐఫోన్​ ఎస్3 (2022) పేరుతో ఈ ఫోన్ మార్కెట్లోకి విడుదల కానుంది.

అయితే ప్రొడక్షన్​ ఆలస్యం కావడం వంటి సమస్యలు ఎదురైతే విడుదల తేదీని ఇంకాస్త ముందుకు జరిపే అవకాశమున్నట్లు కూడా ఈ విషయంపై అవగాహన ఉన్న కొందరు వ్యక్తులు తెలిపారు.

ఇప్పటి వరకు ఉన్న సమచారం ప్రకారం.. మార్చి ఆరంభంలోనే ఈ కొత్త మాడల్​ను ఆవిష్కరించే వీలుంది. 2020 తర్వాత వస్తున్న ఎస్​ఈ మోడల్ ఇదే కావడం గమనార్హం.

ఎస్​ఈ3 విశేషాలు..

ఎస్​ఈ3ని పూర్తి స్థాయి అప్​డేటెడ్ వెర్షన్​గా విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ మోడల్​ 5జీతో అందుబాటులోకి రానుందట. అయితే ఫోన్​ చూసేందుకు ఎస్​ఈ2 మాదిరిగానే ఉండొచచని తెలిసింది.

కెమెరా, ప్రాసెసర్​ విషయంలోను భారీగా మార్పులు చేసినట్లు సమాచారం. యాపిల్​ సొంత చిప్​సెట్​ అయినర.. ఏ15 బయోనిక్​ చిప్​తో ఎస్​3 రానుందట. 3జీబీ ర్యామ్​తో ఈ ఫోన్​ అందుబాటులోకి వచ్చే అవకాశలున్నాయి.

ఐఫోన్ ఎస్​3 ధర దాదాపు 300 డాలర్లు (రూ.22,500)గా ఉండొచ్చని అంచనాలు వస్తున్నాయి.

అయితే ఐపోన్ ఎస్​ఈ3 విడుదల తేదీపై యాపిల్​ అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. త్వరలోనే ఈ విషయంపై ప్రకటన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Also read: Flipkart Big Bachat Dhamaal Sale: రూ.75,000 విలువైన స్మార్ట్ టీవీ ఇప్పుడు రూ.25 వేలకే పొందండి!

Also read: Cheap and Best Phone: నెలకు రూ. 500 లోపు ఈఎంఐతో సూపర్ స్మార్ట్ ఫోన్!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More