Home> బిజినెస్
Advertisement

Amazon Freedom Festival: స్మార్ట్‌ఫోన్ కొనాలంటే ఇదే మంచి అవకాశం, అమెజాన్‌లో భారీ డిస్కౌంట్ ఆఫర్లు

Amazon Freedom Festival: ఆన్‌లైన్ షాపర్లకు పండుగ, ప్రముఖ ఈ కామర్స్ వేదిక అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ ప్రారంభమైంది. ఐదురోజులుపాటు కొనసాగే ఈ ఆఫర్ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లపై భారీగా డిస్కౌంట్ అందనుంది. కొత్త ఫోన్ కొనే ఆలోచన ఉంటే ఈ డీల్స్ మిస్ అవద్దు.
 

Amazon Freedom Festival: స్మార్ట్‌ఫోన్ కొనాలంటే ఇదే మంచి అవకాశం, అమెజాన్‌లో భారీ డిస్కౌంట్ ఆఫర్లు

Amazon Freedom Festival: ఆన్‌లైన్ షాపింగ్ ప్రియులు నిరీక్షిస్తున్న అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ మొదలైంది. ఆగస్టు 4 అంటే ఇవాళ్టి నుంచి ఆగస్టు 8 వరకూ ఐదురోజులు నడుస్తుంది ఈ ప్రత్యేక ఆఫర్ సేల్. వివిధ రకాల ఉత్పత్తులపై అమెజాన్‌లో భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. వివిధ రకాల బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్లపై ఉన్న ఆఫర్లను ఓసారి పరిశీలిద్దాం..

అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్‌లో స్మార్ట్‌ఫోన్లపై భారీ ఆఫర్లు ఉన్నాయి. కొత్త ఫోన్ కొనే ఆలోచన ఉంటే ఇదే మంచి అవకాశం. కేవలం ఐదురోజులు నడిచే అమెజాన్ ఫెస్టివల్ సేల్‌లో ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్లపై భారీ ఆఫర్లు ఉన్నాయి. ప్రైమ్ మెంబర్లకు నిన్నటి నుంచే ఈ ఆఫర్లు అందుబాటులోకి రాగా, మిగిలినవారికి ఇవాళ్టి నుంచి ప్రారంభమైంది. ఇందులో డిస్కౌంట్లు, ప్రత్యేక డీల్స్, క్యాష్‌బ్యాక్ ఆఫర్లతో పాటు భారీ ఎక్స్చేంజ్ ఆఫర్లు కూడా ఉన్నాయి. ఎస్బీఐ క్రెడిట్ కార్డుపై, ఈఎంఐ లావాదేవీలపై 10 శాతం అదనపు డిస్కౌంట్ లభిస్తోంది. అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్‌లో భాగంగా ఇవాళ్టి నుంచి 8వ తేదీ వరకూ ఈ ప్రత్యేక ఆఫర్లు అందుబాటులో ఉంటాయి.

శాంసంగ్ లేటెస్ట్ ఫోల్టబుల్ ఫోన్ల సిరీస్‌పై అద్భుతమైన ఆఫర్లను అమెజాన్ అందిస్తోంది. శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్ట్ 5 స్మార్ట్‌ఫోన్ మార్కెట్ ధర 1,64,999 రూపాయలు కాగా అమెజాన్ ఫ్రీడమ్ ఫెస్టివల్‌లో 1,55,999 రూపాయలకే లభిస్తోంది. అంటే దాదాపు 9 వేల రూపాయల డిస్కౌంట్ లభించనుంది. ఇక ఇదే స్మార్ట్‌ఫోన్‌ను ఎస్బీఐ క్రెడిట్ కార్డుపై కొనుగోలు చేస్తే మరో 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. 

శాంసంగ్ గెలాక్సీ ఎం13 స్మార్ట్ ఫోన్‌పై కూడా భారీ డిస్కౌంట్ లభిస్తోంది. మార్కెట్ ధర 14,999 రూపాయలు కాగా, ఫ్రీడమ్ ఫెస్టివల్‌లో 9,464 రూపాయలకే లభించనుంది. అంటే ఏకంగా 5 వేల డిస్కౌంట్ లభించనుంది. ఇక మార్కెట్‌లో కొత్తగా అందుబాటులో వచ్చిన ఒప్పో ఎఫ్23 జి స్మార్ట్‌ఫోన్‌పై కూడా 2 వేల వరకూ డిస్కౌంట్ లభిస్తోంది. మార్కెట్‌లో అసలు ధర 24,999 రూపాయలు కాగా అమెజాన్ సేల్‌లో 22,999 రూపాయలకు పొందవచ్చు.

ఇక ప్రస్తుతం ట్రెండ్ నడుస్తున్న రియల్ మి నుంచి కూడా మంచి మంచి ఆఫర్లు ఉన్నాయి. రియల్ మి నార్జో 60 ప్రో. ప్రీమియం ఫోన్ ఇది. మార్కెట్ అసలు ధర 23,999 రూపాయలు కాగా ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్‌లో 22,999 రూపాయలకు లభిస్తోంది.అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్‌లో అందరికీ అందించే ఈ ఆఫర్లు కాకుండా ఎస్బీఐ క్రెడిట్ కార్డు ద్వారా లేదా ఈఎంఐ లావాదేవీలతో జరిపే కొనుగోళ్లపై అదనంగా మరో 10 శాతం డిస్కౌంట్ అందనుంది. 

Also read: iPhone15 Launch Date: ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ఫీచర్లు లీక్, లాంచ్ ఎప్పుడు , ధర ఎంతంటే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More