Home> బిజినెస్
Advertisement

Amazon Phones Fest: రూ.499కే శాంసంగ్ స్మార్ట్​ఫోన్.. అమెజాన్ అదిరే ఆఫర్​!

Amazon Fab phones fest: స్మార్ట్​ఫోన్లపై భారీ డిస్కౌంట్లు ఇస్తోంది అమెజాన్​. ఫ్యాబ్​ఫోన్స్​ ఫెస్ట్ సేల్​లో భాగంగా.. అన్ని రకాల స్మార్ట్ఫోన్లపై భారీ తగ్గింపు ఇస్తోంది. అందులో బెస్ట్ డీల్స్​ గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Amazon Phones Fest: రూ.499కే శాంసంగ్ స్మార్ట్​ఫోన్.. అమెజాన్ అదిరే ఆఫర్​!

Amazon Fab Phones Fest: ప్రముఖ ఈ కామర్స్​ దిగ్గజం అమెజాన్‌ మరోసారి ఫ్యాబ్​ఫోన్స్​ ఫెస్ట్ సేల్​ను ప్రారంభించింది. నేడే ప్రారంభమైన ఈ సేల్​ ఈ నెల 14 వరకు అందుబాటులో ఉంటుంది. ఇందులో భాగంగా వివిధ స్మార్ట్​ఫోన్​ బ్రాండ్లపై భారీగా డిస్కౌంట్ ఇస్తోంది. ప్రీమియం మోడళ్ల నుంచి బడ్జెట్ వేరియంట్ల వరకు భారీగా స్పెషల్ డిస్కౌంట్​తో పాటు.. బ్యాంక్​ ఆఫర్​, స్పెషల్ డిస్కౌంట్ వంటివి ఇస్తోంది.

బడ్జెట్​ ధరలో స్మార్ట్​ఫోన్ కొనాలనుకునే వారికి బంపర్ ఆఫర్ ఇస్తోంది అమెజాన్. రూ.12,999 విలువైన శాంసంగ్​ గెలాక్సీ ఎం12ను రూ.500కన్నా తక్కువ ధరకే కొనేందుకు వీలు కల్పిస్తోంది.

ఈ స్మార్ట్​ఫోన్ ఫీచర్లు..

నిజానికి శాంసంగ్​ గెలాక్సీ ఎం12 బడ్జెట్ స్మార్ట్​ఫోన్ అయినప్పటికీ..ప్రీమియం ఫీచర్లతో లభిస్తుంది.. 6.5 అంగుళాల డిస్​ప్లే, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, 48 ఎంపీ మెయిన్ కెమెరా వంటి అధునాతన ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

ఆఫర్ల విషయానికొస్తే..

శాంసంగ్​ గెలాక్సీ ఎం12 4జీబీ ర్యామ్​ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ మార్కెట్ ధర రూ.12,999గా ఉంది. అయితే అమెజాన్ ఫ్యాబ్​ఫోన్స్ ఫెస్ట్​లో.. దీని ధరను రూ. 9,499కి తగ్గించింది అమెజాన్​. అంటే ఫోన్ పై రూ.3,500 ఇస్తోంది.

ఎక్స్ఛేంజ్ ఆఫర్..

శాంసంగ్​ గెలాక్సీ ఎం12 పై రూ.9 వేల వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ అందుబాటులో ఉంది. అంటే పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా ఈ తగ్గింపును పొందొచ్చు. అయితే మీరు ఎక్స్ఛేంజ్ చేసే స్మార్ట్​ఫోన్ అనేది మంచి కండీషన్​లో ఉండి, ఫీచర్లు ఎక్కువగా ఉన్న మోడల్ అయితే.. గరిష్ఠ ఎక్స్ఛేంజ్ విలువ లభిస్తుంది. అలా మీ స్మార్ట్​ఫోన్​కు గరిష్ఠ ఎక్స్ఛేంజ్ విలువ లభిస్తే గనక.. ఈ స్మార్ట్​ఫోన్ ధర రూ.499కే తగ్గుతుంది.

బ్యాంక్ ఆఫర్​..

ఈ సేల్​లో ఎస్​బీఐ క్రెడిట్ కార్డు ద్వారా చెల్లింపులు జరిపితే.. తక్షణం పది శాతం వరకు డిస్కౌంట్ లభించే వీలుంది. ఈ ఆఫర్​ అన్ని స్మార్ట్​ఫోన్లకు వర్తిస్తుంది.

నోట్​: ఈ ఆఫర్ వివరాలన్ని అమెజాన్​ వెబ్​సైట్ ప్రకారం చెప్పడం జరిగింది. మరిన్ని వివరాలకోసం అమెజాన్ మొబైల్ యాప్​ లేదా వెబ్​సైట్​ను చూడొచ్చు.

Also read: Flipkart Mi Fan Festival: రూ.30 వేల విలువైన షియోమీ 11ఐ 5జీ ఫోన్​ రూ.10 వేలకే!

Also read: Cheapest Recharge Plan: రూ.75 తో కాలింగ్, డేటా అది కూడా 30 రోజుల వరకు..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More