Home> బిజినెస్
Advertisement

Airtel 1799 Plan: ఎయిర్‌టెల్ నుంచి సూపర్ ప్లాన్, అత్యంత తక్కువ ధరకు వార్షిక ప్లాన్

Airtel 1799 Plan: దేశంలో టెలీకం రంగంలో ఎయిర్‌టెల్, రిలయన్స్ మధ్య పోటీ తీవ్రంగా ఉంది. యూజర్లను ఆకట్టుకునేందుకు కొత్త కొత్త ప్లాన్స్ ప్రవేశపెడుతున్నాయి. ఈ క్రమంలో ఎయిర్‌టెల్ కొత్తగా మరో ప్లాన్ ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

Airtel 1799 Plan: ఎయిర్‌టెల్ నుంచి సూపర్ ప్లాన్, అత్యంత తక్కువ ధరకు వార్షిక ప్లాన్

Airtel 1799 Plan: ఎయిర్‌టెల్ నుంచి ఇప్పుడు అత్యంత చౌక ధరకు వార్షిక ప్లాన్ అందుబాటులో వచ్చింది. ఇందులో అన్‌లిమిటెడ్ డేటా, కాలింగ్ సౌకర్యం ఉండటం విశేషం. ఇక నెల నెలా రీఛార్జ్ చేయించుకునే అవసరముండదు. ప్రస్తుతం అందుబాటులో ఉండే వార్షిక ప్లాన్స్‌లో ఇది అత్యుత్తమ ప్లాన్ కాగలదు.

మార్కెట్‌లో నిలబడేందుకు, కస్టమర్లను ఆకట్టుకునేందుకు రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ ఎప్పటి కప్పుడు కొత్త కొత్త ప్లాన్స్ ప్రవేశపెడుతున్నాయి. ఇందులో భాగంగా ఎయిర్‌టెల్ ప్రవేశపెట్టిన వార్షిక ప్లాన్ అందర్నీ ఆకట్టుకుంటోంది. ఈ ప్లాన్ తీసుకుంటే ప్రతి నెలా రీఛార్జ్ చేయించుుకునే అవసరముండదు. ఈ ప్లాన్‌లో ఏడాది మొత్తం డేటా, కాలింగ్ రెండూ లభిస్తాయి. ఈ ప్లాన్ 1799 రూపాయలకు లభిస్తుంది. ఇది ఏడాది మొత్తం అంటే 365 రోజులకు వర్తిస్తుంది. దీంతోపాటు ఈ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ కాలింగ్ సౌకర్యం ఉంటుంది. ఇంటర్నెట్ కోసం 24 జీబీ డేటా కంపెనీ అందిస్తోంది. డేటా పెద్దగా వినియోగించనివారికి ఈ ప్లాన్ అద్భుతంగా పనికొస్తుంది. మొత్తం 24 జీబీ డేటాను ఏడాది మొత్తం వినియోగించుకోవచ్చు లేదా ఒకట్రెండు రోజుల్లో వాడుకోవచ్చు. ఎయిర్‌టెల్ అందిస్తున్న అత్యుత్తమమైన వార్షిక ప్లాన్ ఇది. ఈ ప్లాన్‌లో భాగంగా ఉచిత హెలో ట్యూన్, వింక్ మ్యూజిక్ ఉచిత సబ్‌స్క్రిప్షన్, 3 నెలల అపోలో ప్లాన్ లభిస్తాయి.

ఎయిర్‌టెల్ 1799 వార్షిక ప్లాన్‌ను నెలకు లెక్కేస్తే 149 రూపాయలవుతుంది. ఎయిర్‌టెల్ 149 ప్లాన్‌తో పోలిస్తే ఇందులో కూడా 1 జీబీ డేటా లభిస్తుంది కానీ వ్యాలిడిటీ ఉండదు.కేవలం 30 రోజులే వ్యాలిడిటీ ఉంటుంది. ప్రతి నెలా మర్చిపోకుండా రీఛార్జ్ చేయించుకోవల్సి ఉంటుంది.

Also read: Maruti Suzuki: చడీచప్పుడు లేకుండా మారుతి కొత్త మోడల్ లాంచ్, ధర కేవలం 4.8 లక్షలే, మైలేజ్ ఏకంగా 34 కిలోమీటర్లు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More