Home> బిజినెస్
Advertisement

Air India Flash Sale: ఇప్పుడు కేవలం 1037 రూపాయలకే 32 నగరాలకు విమాన ప్రయాణం

Air India Flash Sale: అతి తక్కువ ధరలో విమానయానం చేయాలనుకుంటే ఇదే మంచి అవకాశం. ఏసీ బస్ కంటే తక్కువ ధరకే విమానంలో వెళ్లే అద్భుత అవకాశం. ఎయిర్ ఇండియా ఫ్లాష్ సేల్ ప్రకటించింది. ఈ ఆఫర్ వివరాలు ఇలా ఉన్నాయి.

Air India Flash Sale: ఇప్పుడు కేవలం 1037 రూపాయలకే 32 నగరాలకు విమాన ప్రయాణం

Air India Flash Sale: ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ అతి తక్కువ ధరకు టికెట్లు ప్రకటించింది. ఫ్లాష్ సేల్‌లో భాగంగా తక్కువ ధరకే దేశంలోని 32 నగరాలకు విమానయానం సౌకర్యం కల్పిస్తోంది. ఈ 
టికెట్ ధర ఎంత తక్కువంటే ఏసీ బస్ టికెట్ కంటే తక్కువ.  కేవలం 1000 రూపాయలకే విమాన ప్రయాణం చేయవచ్చు. 

పండుగ సీజన్ ప్రారంభం కాగానే వివిధ విమానయాన సంస్థలు ప్రత్యేక ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. అతి తక్కువ ధరకే టికెట్స్ అందిస్తుంటాయి. ఇందులో భాగంగానే ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ Flash Sale ప్రకటించింది. ఈ సేల్‌లో టికెట్ ధర కేవలం 1037 రూపాయల నుంచి ప్రారంభమవుతుంది. ఇందులో రెండు రకాల టికెట్లు ఉంటాయి. Express Lite టికెట్ ధర 1037 రూపాయలుంటే Express Value టికెట్ ధర 1195 రూపాయలతో మొదలవుతుంది. ఈ ఆఫర్ కూడా ఏదో 1-2 నగరాలకు పరిమితం కాలేదు. దేశంలోని 32 నగరాలకు ఈ ప్రత్యేక ఆఫర్ వర్తిస్తుంది. 

ఢిల్లీ-జైపూర్, కోల్‌కతా-ఇంఫాల్, చెన్నై-భువనేశ్వర్ వంటి 32 డెస్టినేషన్లకు ఈ ప్రత్యేక ఆఫర్ అందుబాటులో ఉంది. Express Biz టికెట్ ధరలు కూడా ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ బోయింగ్ 737-8 ఎయిర్ క్రాఫ్ట్‌లో అందుబాటులో ఉన్నాయి. ఈ ఎయిర్ క్రాఫ్ట్ బిజినెస్ క్లాస్‌లో ఉన్నట్టే 58 ఇంచెస్ సీట్ పిచ్ ఆఫర్ చేస్తుంది. అంతేకాకుండా స్టూడెంట్స్, సీనియర్ సిటిజన్లు, స్మాల్ బిజినెస్ మెన్, డాక్టర్లు, నర్శులు, మిలిటరీ సిబ్బంది కూడా డిస్కౌంట్ టికెట్ పొందవచ్చు. బిజినెస్ , ప్రైమ్ సీట్లపై 47 శాతం వరకూ డిస్కౌంట్ పొందవచ్చు. అంతేకాకుండా 8 శాతం వరకు న్యూ కాయిన్స్ పొందవచ్చు.

ఎయిర్ ఇండియా రానున్న దుర్గా పూజ పండుగ సందర్భంగా దేశంలోని కొన్ని ఎంపిక చేసిన నగరాల నుంచి కోల్‌కతాకు అదనపు విమానాలు నడపనుంది. ఇందులో భాగంగా బెంగళూరు, హైదరాబాద్ నుంచి కోల్‌కతాకు రోజూ నాన్ స్టాప్ విమాన సేవలు అందుబాటులో ఉంటాయి. అంతేకాకుండా ఢిల్లీ నుంచి కోల్‌కతాకు ఆగస్టు 15 నుంచి ముంబై నుంచి కోల్‌కతాకు సెప్టెంబర్ 25 నుంచి విమానాల సంఖ్య పెరగనుంది.

Also read: N Convention Demolition: ఎన్ కన్వెన్షన్ కూల్చివేత ఉన్నదెవరు, కోమటిరెడ్డి ఫిర్యాదే కారణమా, ఇంకేమైనా ఉందా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More