Home> బిజినెస్
Advertisement

Aadhaar Card Loan: ఆధార్ కార్డుతో పర్సనల్ లోన్ ఎలా అప్లై చేయలో తెలుసుకోండి, నిమిషాల్లో మీ ఎక్కౌంట్లో డబ్బులు

Aadhaar Card Loan: చాలామందికి వ్యక్తిగత రుణాల అవసరం ఏర్పడుతుంటుంది. ఇంట్లో ఏదైనా అత్యవసరం వచ్చినప్పుడు తక్షణం డబ్బులు కావల్సి వస్తుంటాయి. ఈ సందర్బంలో వ్యక్తిగత రుణాలు కీలకపాత్ర పోషిస్తుంటాయి. ఆధార్ కార్డుతో వ్యక్తిగత రుణం తీసుకోవాలంటే ఏం చేయాలి, ఎలా చేయాలనే వివరాలు తెలుసుకుందాం.

Aadhaar Card Loan: ఆధార్ కార్డుతో పర్సనల్ లోన్ ఎలా అప్లై చేయలో తెలుసుకోండి, నిమిషాల్లో మీ ఎక్కౌంట్లో డబ్బులు

Aadhaar Card Loan: వ్యక్తిగత రుణం తీసుకోవాలంటే అన్నింటికంటే ముందు కావల్సింది ఆధార్ కార్డు. ఆధార్ కార్డులో పర్సనల్ లోన్ అప్లై చేయడం అనేది చాలా సులభమైన, వేగవంతమైన సిస్టమెటిక్ ప్రక్రియగా మారింది.  ప్రభుత్వం జారీ చేసిన 12 అంకెల యూనిక్ ఐడెంటిటీ నెంబర్‌తో వివిధ ఆర్ధిక సంస్థల్నించి చిన్న చిన్న రుణాలు తీసుకునేందుకు ఉపయోగపడుతుంది.

ఆధార్ కార్డుతో వ్యక్తిగత రుణం ఎలా అప్లై చేయాలి

అవసరమైన డాక్యుమెంట్లు సేకరించాలి. లోన్ కోసం అప్లై చేసేముందు డాక్యుమెంట్స్ ఉన్నాయో లేవో సరిచూసుకోవాలి. ఆధార్ కార్డు, పాన్ కార్డు, అడ్రస్ ప్రూఫ్, పే స్లిప్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు కావాలి.

వ్యక్తిగత రుణాల వడ్డీ రేటు, రీపేమెంట్ షరతులు, చదవి, బ్యాంకులు, ఇతర ప్రైవేట్ సంస్తలకు మద్య తేడాను గ్రహించాలి. మీ ఆర్ధిక అవసరాలకు సరిగ్గా సరిపోయే లెండర్‌ను ఎంచుకోవాలి. లెండర్‌ను ఎంచుకున్న తరువాత లోన్ అప్లై చేసేముందు అదికారిక వెబ్‌సైట్  లేదా సమీప బ్రాంచ్‌కు వెళ్లి వివరాలు తెలసుకోవాలి. లెండర్ ఇచ్చిన అప్లికేషన్ పూర్తిగా నింపాలి. ఇందులో మీ వ్యక్తిగత వివరాలు, ఉద్యోగం వివరాలు, రుణం ఎంత కావాలి వంటి వివరాలు నమోదు చేయాలి. 

ఆ తరువాత అత్యంత కీలకమైన ఆధార్ వెరిఫికేషన్ పూర్తవుతుంది. ఆధార్ అడ్రెస్ ప్రస్తుతం ఉంటున్న ఇళ్ల రెండూ సరికావాలి. అప్పుడే ఈ కేవైసీ పూర్తవుతుందియ ఆధార్ కార్డు, ఐడెంటిటీ ప్రూప్, అడ్రస్ ప్రూఫ్, పే స్లిప్ వంటివి అప్‌లోడ్ చేయాలి. మీరు పంపించిన డాక్యుమెంట్లు పూర్తిగా స్పష్టంగా ఉండాలి. లెండర్ డాక్యుమెంట్ల ఆధారంగా మీ క్రెడిట్ హిస్టరీని వెరిఫై చేస్తాడు. మీకు గరిష్టంగా ఎంతు లోన్ ఇవ్వవచ్చే నిర్ణయిస్తాడు. అన్నీ పూర్తయి మీ లోన్ అప్లికేషన్ ఆమోదిస్తే లోన్ నియమాల అంగీకారం ఇవ్వాల్సి ఉంటుంది. ఒకసారి మీ వివరాలు సరైనవని తేలాక మీ లోన్ మీ ఎక్కౌంట్‌కు బదిలీ అయిపోతుంది. తీసుకున్న రుణాన్ని సులభమైన ఎంచుకున్న వాయిదాల్లో చెల్లించాల్సి ఉంటుంది. 

Also read: August Bank Holidays: ఆగస్టులో బ్యాంకు పనులుంటే జాగ్రత్త, పది రోజులు పనిచేయని బ్యాంకులు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitte , Facebook

Read More