Home> ఏపీ
Advertisement

ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ చేసిన తొలి సంతకం ఇదే

ఎన్నికలకు ముందు తాను ప్రజా సంకల్ప యాత్ర చేస్తున్నప్పుడు ఓ వృద్ధురాలు తనతో చెప్పిన మాటలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్న జగన్.. ఆ అవ్వ, తాతలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోబోతున్నామని అన్నారు.

ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ చేసిన తొలి సంతకం ఇదే

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో వృద్ధాప్య పెన్షన్‌లను పెంచుతున్నట్టుగా  వైయస్ జగన్ తన తొలి సంతకాన్ని చేయడం విశేషం. ప్రమాణ స్వీకారోత్సవం అనంతరం అదే వేదికపై నుంచి వైయస్ జగన్ మాట్లాడుతూ రాష్ట్రంలోని వృద్ధులకు ఇకపై పెన్షన్ కింద నెలకు రూ.2,250 అందజేయనున్నట్టు ప్రకటించడమే కాకుండా వెంటనే అదే ఫైలుపై తన మొదటి సంతకం పెట్టారు. వృద్ధులకు అందించే పెన్షన్‌ మొత్తాన్ని ఇకపై ప్రతీ ఏడాది పెంచి అందించనున్నట్టు వైఎస్ జగన్ స్పష్టంచేశారు. ప్రస్తుతం ఈ పెన్షన్ మొత్తాన్ని రూ.2,250కి పెంచగా వచ్చే ఏడాది నుంచి దీనిని రూ. 2,500, ఆ తర్వాతి ఏడాది నుంచి నెలకు రూ. 2,750 రూపాయలు, ఆ తర్వాత వచ్చే ఏడాది నుంచి రూ. 3,000 రూపాయలకు పెంచనున్నట్లు జగన్ తేల్చిచెప్పారు.

ఎన్నికలకు ముందు తాను ప్రజా సంకల్ప యాత్ర చేస్తున్నప్పుడు ఓ వృద్ధురాలు తనతో చెప్పిన మాటలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్న జగన్.. ఆ అవ్వ, తాతలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోబోతున్నామని అన్నారు. అంతేకాకుండా రెండు చేతులు జోడించి పేరుపేరునా ఆశీస్సులు కోరుతున్నానని, మీ ఆశీస్సులతోనే తాను ముందుకు సాగుతానని జగన్ పేర్కొన్నారు.

Read More