Home> ఏపీ
Advertisement

విజయవాడలో అల్లరిమూకల వీరంగం.. టీఎస్ఆర్టీసీ బస్ డ్రైవర్‌పై దాడి

హైదరాబాద్ జాతీయ రహదారిపై విజయవాడలోని భవానీపురం వద్ద పలువురు ఆకతాయిలు శనివారం అర్ధరాత్రి బీభత్సం సృష్టించారు. రహదారిపై తమ బైకులకు సైడ్ ఇవ్వలేదనే ఆగ్రహంతో రెచ్చిపోయిన యువకులు పది ద్విచక్రవాహనాలపై బస్సును వెంబడించి గొల్లపూడి సెంటర్ వద్ద బస్సును ఓవర్ టేక్ చేసి అడ్డుకున్నారు. అనంతరం బస్ డ్రైవర్‌పై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు.

విజయవాడలో అల్లరిమూకల వీరంగం.. టీఎస్ఆర్టీసీ బస్ డ్రైవర్‌పై దాడి

విజయవాడ: హైదరాబాద్ జాతీయ రహదారిపై విజయవాడలోని భవానీపురం వద్ద పలువురు ఆకతాయిలు శనివారం అర్ధరాత్రి బీభత్సం సృష్టించారు. రహదారిపై తమ బైకులకు సైడ్ ఇవ్వలేదనే ఆగ్రహంతో రెచ్చిపోయిన యువకులు పది ద్విచక్రవాహనాలపై బస్సును వెంబడించి గొల్లపూడి సెంటర్ వద్ద బస్సును ఓవర్ టేక్ చేసి అడ్డుకున్నారు. అనంతరం బస్ డ్రైవర్‌పై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. అడ్డొచ్చిన ప్రయాణికులపై సైతం దాడికి తెగబడిన ఆకతాయిలు బస్ కండక్టర్ వద్ద నుంచి రూ.25,000 దోచుకెళ్లారు. 

ఆకతాయిల దాడిలో తెలంగాణలోని నార్కెట్‌పల్లి బస్ డిపోకు చెందిన డ్రైవర్‌కు తీవ్రగాయాలయ్యాయి. దాడి జరుగుతుండగానే సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకునేలోగా పలువురు యువకులు అక్కడి నుంచి పరారవగా మరో 8 మంది యువకుల వరకు బైకులతో సహా పోలీసులకు దొరికిపోయినట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై బస్ డ్రైవర్‌తోపాటు పలువురు ప్రయాణికులు విజయవాడలోని భవానీపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

దాదాపు 20 మంది యువకులు ఈ దాడిలో పాల్గొన్నట్టు తెలుస్తోంది. బస్‌పై దాడి ఘటనను తీవ్రంగా పరిగణించిన పోలీసులు పరారైన మిగతా యువకుల వివరాలను దాడికి పాల్పడిన చోటే అరెస్ట్ అయిన 8 మంది యువకుల నుంచి రాబడుతున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఆర్టీసి బస్సు కావడంతో నార్కెట్‌పల్లి నుంచి సైతం పోలీసులు విజయవాడ వెళ్లి అక్కడి పోలీసులతో కలిసి మాట్లాడినట్టు సమాచారం అందుతోంది.

Read More