Home> ఏపీ
Advertisement

గంటకు 240-245 కిమీ వేగంతో ఈదురుగాలులు, భారీ వర్షాలు

గంటకు 240-245 కిమీ వేగంతో ఈదురుగాలులు, భారీ వర్షాలు

గంటకు 240-245 కిమీ వేగంతో ఈదురుగాలులు, భారీ వర్షాలు

హైదరాబాద్: ఫొని తుపాన్ కారణంగా ఒడిషా సముద్ర తీరం అల్లకల్లోలంగా మారింది. ఒడిషా తీరప్రాంతాల్లో ఓవైపు గంటకు 240-245 కిమీ వేగంతో భారీ శబ్ధంతో కూడిన ఈదురుగాలులు వీస్తుండగా మరోవైపు ఆగకుండా కురుస్తోన్న భారీ నుంచి అతిభారీ వర్షాలు తీరప్రాంత వాసులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. భువనేశ్వర్‌లో తుపాన్ ధాటికి గంటకు 175 కిమీ వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి.

ఈదురు గాలుల తాకిడికి భారీ వృక్షాలు నేలకూలాయి. దీంతో అనేక ప్రాంతాల్లో రహదారి వ్యవస్థ దెబ్బతింది. ముందస్తు జాగ్రత్త చర్యగా అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపేశారు.

ఒడిషా తీర ప్రాంతాల్లో తుపాన్ ప్రభావం అధికంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ అధికారుల అంచనాల ప్రకారం.. తుపాన్ తీరాన్ని తాకే ప్రక్రియ సుమారు రెండున్నర గంటలపాటు కొనసాగనుందని తెలుస్తోంది. తుపాన్ పూర్తిగా తీరాన్ని తాకిన అనంతరం తొలుత పశ్చిమ బెంగాల్ వైపు కదలనున్న తుపాన్ ఆ తర్వాత బంగ్లాదేశ్ దిశగా వెళ్లనుంది. ఒడిషాలో పూరి జిల్లాలో తీరాన్ని తాకిన అనంతరం తుపాన్ కొంతమేరకు బలహీనపడనున్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

తుపాన్ ప్రభావం తీవ్రత అధికంగా ఉన్న ఒడిషా తీరప్రాంతాల్లో పరిస్థితి ఇలా వుండగా అక్కడితో పోల్చుకుంటే అదృష్టవశాత్తుగా ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల్లో తుపాన్ తీవ్రత కొంత తక్కువగానే ఉందంటున్నారు విశాఖ వాతావరణ శాఖ అధికారులు. విశాఖ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం శ్రీకాకుళం జిల్లాలో గంటకు 70-80 కిమీ నుంచి 90 కిమీ వేగంతో ఈదురుగాలుల వేగంతో గాలులు వీస్తూ అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

Read More