Home> ఏపీ
Advertisement

MLC Anantha Babu: కారు డ్రైవర్ ను ఎమ్మెల్సీనే కొట్టి చంపాడా? అనంతబాబు అరెస్ట్ కు జాప్యమెందుకు?

MLC Anantha Babu: ఆంధ్రప్రదేశ్ లో దుమారం రేపుతున్న వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు మాజీ డ్రైవర్ సుబ్రమణ్యం మృతి కేసు మిస్టరీ ఇంకా వీడలేదు.మూడు రోజలవుతున్నా పోలీసులు అసలు ఏం జరిగిందో తేల్చలేకపోయారు. పోస్ట్ మార్టమ్ నివేదికలో సుబ్రమణ్యానిది హత్యేనని తేలింది.

MLC Anantha Babu: కారు డ్రైవర్ ను ఎమ్మెల్సీనే కొట్టి చంపాడా? అనంతబాబు అరెస్ట్ కు జాప్యమెందుకు?

MLC Anantha Babu: ఆంధ్రప్రదేశ్ లో దుమారం రేపుతున్న వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు మాజీ డ్రైవర్ సుబ్రమణ్యం మృతి కేసు మిస్టరీ ఇంకా వీడలేదు. మూడు రోజలవుతున్నా పోలీసులు అసలు ఏం జరిగిందో తేల్చలేకపోయారు. సుబ్రమణ్యం మృతిని మొదట అనుమానాస్పద కేసుగా నమోదు చేశారు పోలీసులు. మృతుడి తల్లిదండ్రులు  ఎమ్మెల్సీ అనంతబాబుపై అనుమానాలు వ్యక్తం చేసినా పట్టించుకోలేదు. కాని తర్వాత అనుమానాస్పద కేసును హత్య కేసుగా మార్చారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు, ప్రాధమిక అధారాలను బట్టి ఎమ్మెల్సీ అనంతబాబును పేరు చేర్చారు. అనంతబాబు ప్రధాన నిందితుడిగా ఉన్నారని, అతన్ని అరెస్ట్ చేస్తామని జిల్లా ఎస్పీ రవీంధ్రబాబు శనివారం ప్రకటించారు. కాని ఎస్పీ ప్రకటన చేసి రెండు రోజలవుతున్నా.. కేసులో ఎవరినీ అరెస్ట్ చేయలేదు. దీంతో అధికార పార్టీ ఎమ్మెల్సీని పోలీసులు కాపాడే ప్రయత్నం చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.

పోస్ట్ మార్టమ్ నివేదికలోనూ సుబ్రమణ్యానిది హత్యేనని తేలింది. మర్మాంగాలపై తీవ్రంగా కొట్టడంతోనే ఆయన మృతి చెందాడని వెల్లడైంది. సుబ్రహ్మణ్యం శరీరంపై గాయాలు ఉన్నట్లు డాక్టర్లు నిర్ధారించారు.అతని ఎడమ చేయి, ఎడమకాలు బొటనవేలు, హెడ్ పై బలమైన గాయాలు ఉన్నట్లు పోస్ట్ మార్టమ్ లో గుర్తించారు. ప్రధాన నిందితుడిగా అనంతబాబే ఉన్నారని జిల్లా ఎస్పీ కూడా చెప్పారు. ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నామని చెప్పారు. అయినా మూడు రోజులైనా ఎందుకు పట్టుకోవడం లేదన్నదే ప్రశ్నగా మారింది. మరోవైపు ఎమ్మెల్సీ అనంతాబాబు పోలీసుల అదుపులోనే ఉన్నారనే ప్రచారం సాగుతోంది.ఎమ్మెల్సీ అనంతబాబుతో పాటు మరో ఆరుగురు ఈ కేసులో నిందితులుగా ఉన్నారని పోలీసులు నిర్ధారించారని తెలుస్తోంది. ఆదివారం అరెస్ట్ చేస్తే పోలీసుల కస్టడీలో ఉంచాలనే ఉద్దేశంతోనే ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్ట్ విషయంలో పోలీసులు ఆలస్యం చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. శుక్రవారం ఆయన తన  ఇద్దరు గన్‌మెన్లను వదిలి కనిపించకుండా పోయారు.ఎమ్మెల్సీఅనంతబాబు రాజమండ్రి, కాకినాడ పరిసర ప్రాంతాల్లోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీతో పాటు మిగితా నిందితులను అరెస్టును ఇవాళ చూపించే అవకాశం ఉంది.

మరోవైపు కేసు విచారణలో పోలీసుల తీరు వివాదాస్పదమవుతోంది. మొదటి నుంచి ఎమ్మెల్సీపై ఆరోపణలు వస్తున్నా పట్టించుకోని పోలీసులు.. సుబ్రమణ్యం కుటుంబ సభ్యులను మాత్రం విచారణ పేరుతో ఇబ్బందలకు గురి చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. తమను పోలీస్ స్టేషన్ రావాలని పోలీసులు ఒత్తిడి తెస్తున్నారని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. కేసును వెనక్కి తీసుకోవాలని ఎమ్మెల్సీ అనంతబాబు అనుచరులు.. సుబ్రమణ్యం కుటుంబ సభ్యులపై భయపెడుతున్నారనే ప్రచారం సాగుతోంది. సుబ్రమణ్యం హత్య కేసును సీరియస్ గా తీసుకున్న దళిత సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. దీంతో కాకినాడలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.

READ ALSO: Gaddar Meet Amit sha: అమిత్ షాను గద్దర్ ఎందుకు కలిశారు? బీజేపీ సభలో అసలేం జరిగింది?

READ ALSO: TS 10th Exams 2022: నేటి నుంచి పదో తరగతి పరీక్షలు షురూ.. విద్యార్థులు గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయాలు ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More