Home> ఏపీ
Advertisement

Visakhapatnam land scam: విశాఖ భూకుంభకోణమంతా ఆ 126 ఎన్ఓసీలపైనే, కొనసాగుతున్న సిట్ దర్యాప్తు

Visakhapatnam land scam: విశాఖపట్నంలో భారీ భూ కుంభకోణాలు చోటుచేసుకున్నాయి. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగిన భూ కుంభకోణాలపై ప్రభుత్వం దర్యాప్తు ప్రారంభించింది. దర్యాప్తు వివరాల్ని ప్రత్యేక దర్యాప్తు బృందం వెల్లడించింది.
 

Visakhapatnam land scam: విశాఖ భూకుంభకోణమంతా ఆ 126 ఎన్ఓసీలపైనే, కొనసాగుతున్న సిట్ దర్యాప్తు

Visakhapatnam land scam: విశాఖపట్నంలో భారీ భూ కుంభకోణాలు చోటుచేసుకున్నాయి. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగిన భూ కుంభకోణాలపై ప్రభుత్వం దర్యాప్తు ప్రారంభించింది. దర్యాప్తు వివరాల్ని ప్రత్యేక దర్యాప్తు బృందం వెల్లడించింది.

ఆంధ్రప్రదేశ్ ( Andhra pradesh )‌‌లోని విశాఖపట్నంలో తెలుగుదేశం ప్రభుత్వ ( Telugu Desam government ) హయాంలో పెద్ద ఎత్తున భూకుంభకోణాలు జరిగాయని ఆరోపణలు వెల్లువెత్తాయి. 2019లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తరువాత విశాఖలో జరిగిన భూ కుంభకోణాల ( Visakhapatnam land scam ) నిగ్గు తేల్చేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేసింది. సిట్ ఛైర్మన్ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతోంది. ఈ విచారణకు సంబంధించిన వివరాల్ని సిట్ వెల్లడించింది. ప్రత్యేక దర్యాప్తు బృందం ఛైర్మన్ విజయ్ కుమార్ ఈ వివరాల్ని వెల్లడించారు.

విశాఖపట్నం రూరల్ మండలాల్లో తహశీల్దార్ల నుంచి 431 నివేదికలు కోరామని..ఇందులో 141 నివేదికలు ఇప్పటికే వచ్చాయని సిట్ ఛైర్మన్ విజయ్ కుమార్ ( SIT Chairman vijay kumar )తెలిపారు. వచ్చిన నివేదికల్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఇష్టారాజ్యంగా జారీ చేసిన 126 ఎన్ఓసీ ( 126 NOCs )లపైనే ప్రధానంగా విచారణ చేస్తున్నట్టు చెప్పారు. అదే విధంగా గతంలో పనిచేసిన ఐఏఎస్ అధికారులు ప్రొసీజర్ ఫాలో అయ్యారా లేదా అనేది కూడా దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఎన్ఓసీ విషయంలో ఉన్నతాధికారుల తప్పిదాలపై సిట్ నివేదికలో పొందుపరుస్తామన్నారు. 22/A నిషేధిత భూముల విషయంలో జరిగిన అక్రమాలపై దర్యాప్తు జరుగుతోందని చెప్పారు. సిట్ కాల పరిమితి ఫిబ్రవరి 28 వరకూ ఉందని.. ఈలోగా సిట్ మిడ్ టర్మ్, ప్రీ ఫైనల్ నివేదిక ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. 

Also read: Mlc Elections: ఏపీలో ఆరు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More