Home> ఏపీ
Advertisement

Venkaiah Naidu on Sr NTR: ఎన్టీఆర్‌‌‌‌కు వెన్నుపోటులో ఆరుగురు మహిళలు.. అప్పటి నిజం బయటపెట్టిన వెంకయ్యనాయుడు

Venkaiah Naidu Sensational Comments: తెనాలిలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సీనియర్ ఎన్టీఆర్ వెన్నుపోటు గురించి సంచలన విషయం బయట పెట్టారు. ఆ వివరాల్లోకి వెళితే 

Venkaiah Naidu on Sr NTR: ఎన్టీఆర్‌‌‌‌కు వెన్నుపోటులో ఆరుగురు మహిళలు.. అప్పటి నిజం బయటపెట్టిన వెంకయ్యనాయుడు

Venkaiah Naidu Sensational Comments on Sr NTR Backstabbing Episode: ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాకు చెందిన వెంకయ్య నాయుడు అనూహ్యంగా జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పి ఏకంగా ఉపరాష్ట్రపతిగా కూడా ఎన్నికై చరిత్రలో తనకంటూ ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్నారు. ఈ మధ్యనే ఉపరాష్ట్రపతిగా పదవీ విరమణ చేసిన ఆయన తాజాగా తెనాలిలో జరుగుతున్న ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో పాల్గొన్నారు.

నందమూరి కుటుంబ సభ్యులతో కలిసి ఈ వేడుకల్లో పాల్గొన్న వెంకయ్య నాయుడు, ఎన్టీఆర్ గురించి ఆయన వెన్నుపోటు ఎపిసోడ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకసారి ఎన్టీఆర్ తో పాటు తాను కూర్చున్న సమయంలో ఆరుగురు మహిళలు ఆయన కాళ్లకు నమస్కరించారని అలా ఎందుకు చేశారని ఎన్టీఆర్ ని అడిగితే వారికి తనపై ఉన్న ప్రేమ అలా చేయించిందని అన్నారని అయితే తాను మాత్రం అది ప్రేమ కాదు పిండాకూడు కాదు అన్నానని ఆయన గుర్తు చేసుకున్నారు.

అయితే కొన్నాళ్ల తర్వాత జరిగిన వెన్నుపోటు ఎపిసోడ్లో ఆ ఆరుగురు మహిళలే ముందు ఉన్నారని ఆయన కామెంట్ చేశారు. ఎన్టీఆర్ ఎలాంటి కల్మషం లేని వ్యక్తి అని పేర్కొన్న వెంకయ్య నాయుడు రాజకీయాల్లో సైతం అంతే బోళాతనంగా ఉండేవారని అందరినీ నమ్మే వారని గుర్తు చేసుకున్నారు. బహుశా అందుకే ఆయన వెన్నుపోటుకు గురై ఉండవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇక రాజకీయాల్లోకి విప్లవాన్ని తీసుకొచ్చిన మహా వ్యక్తి ఎన్టీఆర్ అని పేర్కొన్న వెంకయ్య నాయుడు పేదవారి కోసం ఆయన అనేక సంక్షేమ పథకాలు కూడా తెచ్చారని అప్పటివరకు వంటింటికే పరిమితమైన ఆడపడుచులను సైతం రాజకీయాల్లోకి ఆహ్వానించి వారిని ప్రోత్సహించారని అన్నారు. ఎన్టీఆర్ తన వెనుక జరుగుతున్న కుట్రలో కుతంత్రాలను గమనించలేకపోయారని బహుశా అందుకే ఆయనను వెన్నుపోటు పొడిచి ఉండవచ్చని వెంకయ్యనాయుడు కామెంట్ చేశారు.

ఇక సిద్ధాంతాలు వేరైనా పద్ధతిగా ఉండేవారంటే తనకి గౌరవం అని పేర్కొన్న ఆయన ఎన్టీఆర్ స్ఫూర్తి ఈరోజు తరం వారు కూడా కొనసాగించాలని అభిప్రాయపడ్డారు. ఉపరాష్ట్రపతి అయ్యాక రాజకీయాలు వదిలేసాను కానీ ప్రజలను మాత్రం కలుసుకోవడం మానలేదని ఆయన అన్నారు. ఉచితాలు అనుచితం అని పేర్కొన్న ఆయన చేపలు పెట్టడం కాదు అవి పట్టడం ఎలాగో నేర్పించాలని అన్నారు.

ప్రస్తుతం సమాజంలో అశాంతి పెరుగుతోందని మనుషుల్లో కూడా ఈ అశాంతి భావన ఎక్కువగా పెరిగిపోతోందని అన్నారు. ఇక ప్రభుత్వ పరిపాలన కూడా మాతృభాషలో ఉండాలని పేర్కొన్న ఆయన న్యాయవ్యవస్థలో తీర్పులు సైతం తెలుగులోనే ఉండాలని అన్నారు. శ్వాస, భాషా మనకు రెండు ఎంతో ముఖ్యమైన పేర్కొన్న ఆయన ఇవి రెండు ఆగకూడదని అన్నారు. మన భాష కళ్ళలాంటిది అయితే ఇంగ్లీష్ కళ్లద్దాలు లాంటిది, కళ్ళు ఉంటేనే అసలు కళ్లద్దాలు ఉపయోగపడతాయని ఆయన అన్నారు.

Also Read: Chinmayi : నయనతార మీద అసభ్య కామెంట్లు.. ఆడపిల్లలు పుడితే వారి పరిస్థితి ఏంటి?

Also Read: IndiGo winter Sale 2023: ₹2వేలకే విమాన టికెట్‌.. ఇండిగో స్పెషల్ ఆఫర్ చూశారా!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.

 
 
Read More