Home> ఏపీ
Advertisement

Vallabhaneni Vamsi slams Lokesh: లోకేశ్‌కు మ్యాటర్‌ లేదు : వల్లభనేని వంశీ ఘాటు వ్యాఖ్యలు

Vallabhaneni Vamsi slams Lokesh: రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలతో సీఎం జగన్‌కు (AP CM YS Jagan about TDP attacks) ఎలాంటి సంబంధం లేదన్న ఆయన...  ఎన్ని జాకీలు, క్రెయిన్లు, రాడ్లు పెట్టి లేపిన నారా లోకేష్ (Nara Lokesh) ఎందుకు పనికి రాడని ఎద్దేవా చేశారు.

Vallabhaneni Vamsi slams Lokesh: లోకేశ్‌కు మ్యాటర్‌ లేదు : వల్లభనేని వంశీ ఘాటు వ్యాఖ్యలు

Vallabhaneni Vamsi slams Lokesh: అమరావతి: నారా లోకేశ్‌పై గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. లోకేష్‌కి మీటర్‌, మోటర్‌, మ్యాటర్‌ ఏవీ లేవని వల్లభనేని వంశీ వ్యాఖ్యానించారు. లోకేష్‌ని ఉద్దేశించి పరుష పదజాలం ఉపయోగించిన వంశీ.. లోకేష్ దేనికీ పనికిరాడని, ప్రజలు ఆయన్ని నాయకుడిగా ఆమోదించరని వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడు తదనంతరం లోకేష్ ఇక పాలు, పెరుగు అమ్ముకుని బతకాల్సిందేనని వల్లభనేని వంశీ వ్యాఖ్యానించారు. 

బుధవారం మీడియాతో మాట్లాడిన వల్లభనేని వంశీ.. ''టీడీపీ అధికారం కోల్పోయిందన్న కోపంతో ఉన్న చంద్రబాబు.. ఇంకో రెండు, మూడేళ్లు ఎన్నికల కోసం ఆగలేక, తన కొడుకును ప్రయోజకుడిని చేయలేకే ఇలా అధికార పార్టీపై దాడులకు పాల్పడుతున్నారు'' అని అన్నారు. అన్ని ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు (Chandrababu naidu) చేసిన డ్రామాలన్నీ చూశాం. హైదరాబాద్‌ నుంచి ఎల్లో మీడియాతో టీడీపికి అనుకూల వార్తలు రాయించడం, మా కులపెద్దలందరినీ సమావేశపరిచి తన కొడుకును ముఖ్యమంత్రిని చేయండి, తనను ప్రధాన మంత్రిని చేయండి అని వేడుకోవడం వంటివన్నీ అయిపోయాయని మండిపడ్డారు. 

Also read : TDP Leader Pattabhi Arrested : టీడీపీ నేత పట్టాభిని అరెస్టు చేసిన పోలీసులు

ఒక అప్రయోజకుడైనటువంటి కొడుకును, దద్దమ్మను, చవట సన్నాసిని పెట్టుకుని చంద్రబాబు ఏమీ చేయలేక... సహనం కోల్పోయి ఇలా ప్రవర్తిస్తున్నారని వంశీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలతో సీఎం జగన్‌కు (AP CM YS Jagan about TDP attacks) ఎలాంటి సంబంధం లేదన్న ఆయన...  ఎన్ని జాకీలు, క్రెయిన్లు, రాడ్లు పెట్టి లేపిన నారా లోకేష్ (Nara Lokesh) ఎందుకు పనికి రాడని ఎద్దేవా చేశారు.

Also read : YSRCP Janagraha Deeksha : రేపటి నుంచి వైఎస్సార్‌సీపీ జనాగ్రహ దీక్షలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More