Home> ఏపీ
Advertisement

SV Medical College: ఎస్‌వీ మెడికల్ కాలేజీలో కండోమ్ ప్యాకెట్లు.. తుప్పల్లో దిమ్మతిరిగే విషయాలు

Sri Venkateswara Medical College: తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజీ బాయ్స్‌ హాస్టల్‌ను అసాంఘిక కార్యాకలపాలకు అడ్డగా మార్చేశారు. పొదల్లో ఏపుగా పెరిగిన చెట్లపై పరుపులు వేసి మంచాలుగా మార్చేశారు. అద్దెలకు ఇస్తూ.. జోరుగా వ్యభిచారం నిర్వహిస్తున్నారు.
 

SV Medical College: ఎస్‌వీ మెడికల్ కాలేజీలో కండోమ్ ప్యాకెట్లు.. తుప్పల్లో దిమ్మతిరిగే విషయాలు

Sri Venkateswara Medical College: తిరుపతి ఎస్‌వీ మెడికల్ కాలేజీ బాయ్స్‌ హాస్టల్‌లో దిమ్మతిరిగే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసులు చెకింగ్ చేపట్టగా.. కళ్లు బైర్లు కమ్మే దృశ్యాలు కనిపిస్తున్నాయి. క్యాంపస్‌లో విచ్చలవిడిగా డ్రగ్స్ వినియోగంతోపాటు హాస్టల్‌ను అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మార్చేశారు. విచ్చలవిడిగా వ్యభిచారం, హాస్టల్‌ పరిసరాల్లో కండోమ్ ప్యాకెట్లు ప్రత్యక్షం కావడంతో అధికారులు నివ్వెరపోతున్నారు. చదువుల నిలయమైన ఎస్‌వీ మెడికల్ కాలేజీలో ఇలాంటి సంఘటనలు వెలుగులోకి రావడంపై అందరూ ఆశ్చర్యపోతున్నారు.  

 Also Read: IPL 2024 Schedule: ఐపీఎల్‌ ప్రారంభంపై స్పష్టత.. అప్పటి నుంచే మొదలవుతుందని చైర్మన్‌ ప్రకటన

ఎస్‌వీ మెడికల్ కాలేజీ బాయ్స్‌ హాస్టల్‌లో ర్యాగింగ్ విషయంలో విద్యార్థుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం ఓ అమ్మాయి విషయంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. విషయం తెలుసుకున్న అధికారులు రెండు వర్గాలకు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. అయినా వారి తీరులో మార్పు రాలేదు. గతంలో ఇలాంటి సంఘటన చోటు చేసుకోగా.. ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

యూనివర్సిటీ ప్రాంగణాలను సర్వంగా సుందరంగా తీర్చిదిద్దాలని నిర్ణయించిన అధికారులు.. బాయ్స్‌ హాస్టల్‌ పరిసరాల్లోని తుప్పలను తొలగించేందుకు సిద్ధమయ్యారు. పనులు మొదలు పెట్టగా.. కళ్లు బైర్లు కమ్మే విషయాలు వెలుగులోకి వచ్చాయి. వెదురు మొక్కలు గుబురుగా పెరగడంతో అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మార్చేశారు. ఏపుగా పెరిగిన చెట్లపైనే మంచం మాదిరి తయారు చేసి.. వాటిపై పరుపులు కూడా వేశారు. చెట్లపై ఎక్కేందుకు నిచ్చెలను ఏర్పాటు చేసి ఆ పరుపులను రెంట్‌కు ఇస్తూ కండోమ్‌లను సప్లై చేస్తూ వ్యభిచారం నిర్వహిస్తున్నారు. యువతీ యువకులు అక్కడికి వచ్చి.. మత్తు మందులు సేవిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. 

అధికారులు ఈ ప్రాంతాన్ని శుభ్రం చేస్తుండగా.. ఇక్కడ కనిపించి దృశ్యాలను చూసి నివ్వెరపోయారు. క్యాంపస్‌లోకి ఐడీ కార్డు లేకుండా వస్తే గేటు వద్దే వెనక్కి పంపించే సెక్యురిటీ సిబ్బంది.. హాస్టల్ పరిసరాల్లో ఇంత తతాంగం జరుగుతున్నా పట్టించుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. పోలీసులకు అధికారులు సమాచారం ఇవ్వగా.. యూనివర్సిటీకి చేరుకున్నారు. హాస్టల్‌ పరిసరాల్లో తనిఖీలు చేపట్టి.. మద్యం బాటిళ్లు, కండోమ్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. 

 Also Read: Movie Chance Fraud: సినిమా ఛాన్స్‌ల పేరిట తన 'కోరికలు' తీర్చుకుని మోసం చేసిన నటుడు

 

అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Read More