Home> ఏపీ
Advertisement

Rains in ap: వేసవి నుంచి ఉపశమనం, రాష్ట్రంలో పదిరోజుల పాటు అకాల వర్షాలు

Rains in ap: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మండ వేసవి నుంచి కాస్త ఉపశమనం లభించనుంది. దక్షిణ బంగాళాఖాతంలో వచ్చిన మార్పుల కారణంగా రాష్ట్రంలో పదిరోజుల పాటు అకాల వర్షాలు పడనున్నాయి. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్ష సూచన ఉంది.
 

Rains in ap: వేసవి నుంచి ఉపశమనం, రాష్ట్రంలో పదిరోజుల పాటు అకాల వర్షాలు

Rains in ap: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మండ వేసవి నుంచి కాస్త ఉపశమనం లభించనుంది. దక్షిణ బంగాళాఖాతంలో వచ్చిన మార్పుల కారణంగా రాష్ట్రంలో పదిరోజుల పాటు అకాల వర్షాలు పడనున్నాయి. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్ష సూచన ఉంది.

దక్షిణ బంగాళాఖాతం ( Bay of Bengal)నుంచి వస్తున్న తేమగాలులు, ఉత్తర బంగాళాఖాతం, అరేబియా సముద్రాల్లో అధిక పీడన ప్రాంతాలు కొనసాగుతున్నాయి. ఈ కారణంగా రానున్న 10 రోజుల పాటు రాష్ట్రంలో అక్కడక్కడా అకాల వర్షాలు ఎక్కువగా పడే సూచనలున్నాయి. ముఖ్యంగా రాయలసీమతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో బుధవారం నుంచి అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఏప్రిల్ 15, 16 తేదీల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ( IMD) తెలిపింది. రాయలసీమతో పాటు గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల్లో పలుచోట్ల భారీవర్షాలు ( Heavy Rains) పడతాయని తెలిపారు.

మరోవైపు ఉత్తరాంధ్రలో ఏజెన్సీ ప్రాంతాలకు మాత్రమే వర్షసూచన( Rains) ఉందని తెలుస్తోంది. సముద్రతీర ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. జార్ఖండ్, ఒడిశాల మీదుగా ఉపరితల ద్రోణి సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తువరకు వ్యాపించి ఉందని..దీంతో పాటు తేమగాలుల ప్రభావంతో ఉత్తర కోస్తా జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని ఐఎండీ వెల్లడించింది. దక్షిణ కోస్తా, రాయలసీమలో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయి.  

Also read: Ramadan Wishes: ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు అందించిన వైఎస్ జగన్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More