Home> ఏపీ
Advertisement

Election commission: ఏకగ్రీవాలు ప్రజాస్వామ్యానికి మంచిది కాదు

Election commission: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పర్యటన కొనసాగుతోంది. పంచాయితీ ఎన్నికల నేపధ్యంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్ని పర్యటిస్తున్న ఆయన..ఏకగ్రీవాలపై స్పందించారు.

Election commission: ఏకగ్రీవాలు ప్రజాస్వామ్యానికి మంచిది కాదు

Election commission: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పర్యటన కొనసాగుతోంది. పంచాయితీ ఎన్నికల నేపధ్యంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్ని పర్యటిస్తున్న ఆయన..ఏకగ్రీవాలపై స్పందించారు.

ఏపీ ( AP ) లో జరుగుతున్న పంచాయితీ ఎన్నికల ( Panchayat Elections ) పర్యవేక్షణలో భాగంగా జిల్లా పర్యటనలు చేపట్టారు ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్. ఇవాళ తూర్పు గోదావరి జిల్లాలో పలు ప్రాంతాల్ని పర్యటించి..కాకినాడ కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడారు. ఏకగ్రీవాలకు వ్యతిరేకం కాదని..అయితే ఏకగ్రీవాలు ప్రజాస్వామ్యానికి అంత మంచిది కాదని నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ ( Nimmagadda Ramesh Kumar ) భిన్నస్వరాన్ని వినిపించారు‌. ప్రజాస్వామ్యంలో పోటీ అనేది అరోగ్యకరమని తెలిపారు. ఏకగ్రీవాలు ( Unanimous )జరిగితేనే గ్రామాల్లో శాంతి భద్రతలు ఉంటాయనేది పిడివాదమని అభిప్రాయపడ్డారు. 

ప్రజాస్వామ్యం ( Democracy ) లో భిన్నస్వరాలు వినబడాలని, అప్పుడే బలమైన సమాజం ఏర్పడుతుందని, ఇదే రాజ్యాంగం బాధ్యత అని వివరించారు. తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా పోలింగ్ శాతం పెంచడానికి అధికార యంత్రాంగం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఎన్నికలు పూర్తయ్యేంతవరకు గ్రామాల్లోని ప్రతి కదలికపై నిఘా ఉంచేందుకు ఎన్నికల నిఘా యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. 

Also read: RTI Ex Commissioner: నిమ్మగడ్డ పరిధి దాటి..ప్రమాదకరంగా వ్యవహరిస్తున్నారు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More