Home> ఏపీ
Advertisement

Coronavirus alert in TTD : ఎన్ఆర్ఐ, విదేశీ భక్తులకు టీటీడీ స్పెషల్ రిక్వెస్ట్

విదేశాల నుంచి వచ్చే ఎన్నారైలు (NRIs), విదేశీ భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు (TTD) ఓ ప్రత్యేక విజ్ఞప్తి చేసింది. విదేశాల నుంచి వచ్చే వారితో కరోనావైరస్ (Coronavirus) వ్యాపించిన ఘటనల నేపథ్యంలో టీటీడీ ఈ విజ్ఞప్తిచేసింది. 

Coronavirus alert in TTD : ఎన్ఆర్ఐ, విదేశీ భక్తులకు టీటీడీ స్పెషల్ రిక్వెస్ట్

తిరుపతి: విదేశాల నుంచి వచ్చే ఎన్నారైలు (NRIs), విదేశీ భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు (TTD) ఓ ప్రత్యేక విజ్ఞప్తి చేసింది. స్వదేశీ పర్యటనకు వచ్చిన ప్రావాస భారతీయులు కానీ లేదా భారత్ పర్యటనకు వచ్చే విదేశీయులు కానీ భారత్‌కి వచ్చిన తర్వాత 28 రోజుల వరకు తిరుమల తిరుపతి దేవస్థానం సందర్శనానికి రాకూడదని టీటీడీ విజ్ఞప్తి చేసింది. విదేశాల నుంచి వచ్చే వారితో కరోనావైరస్ (Coronavirus) వ్యాపించిన ఘటనల నేపథ్యంలో టీటీడీ ఈ విజ్ఞప్తిచేసింది. తిరుమలలో పవిత్ర స్నానాలు మొదలుకుని శ్రీవారి దర్శనం వరకు అనేక కార్యక్రమాల్లో భక్తులు పాల్గొనాల్సి ఉంటుంది కనుక.. విదేశాల నుంచి వచ్చే భక్తుల్లో ఎవరికైనా కరోనావైరస్ ఉన్నట్టయితే.. అది వేగంగా ఇతరులకు వ్యాపించే ప్రమాదం ఉందనే ఉద్దేశంతోనే ముందు జాగ్రత్త చర్యగా ఎన్నారై భక్తులు, విదేశీయులకు ఈ విజ్ఞప్తి చేస్తున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు పేర్కొంది. స్వామి వారి దర్శనార్థం వచ్చే భక్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్టు టీటీడీ స్పష్టంచేసింది. 

అయితే, కొద్దిరోజుల పాటే భారత్‌లో ఉండి.. ఆలోగానే స్వామి వారిని దర్శనం చేసుకుని తిరిగి వెళ్లిపోవాలని భావించి వచ్చే వారికి ఇది ఓ రకంగా ఇబ్బందికరమైన పరిణామమే కానుంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Read More