Home> ఏపీ
Advertisement

Grama Ward Sachivalayam Salary: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు షాక్​.. అక్టోబరు జీతాల్లో కోత!

Grama Ward Sachivalayam: రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఊహించని షాక్​ తగిలింది. అక్టోబరు నెలకు సంబంధించిన జీతాల్లో కొందరికి 10 శాతం.. మరికొందరికి 50 శాతం కోత విధించనట్లు ఉత్తర్వులు వెలువడ్డాయి. బయోమెట్రిక్​ యంత్రం సరిగా పనిచేయక పోవడంతో తక్కువ హాజరు నమోదవ్వడమే అందుకు కారణమని తెలుస్తోంది. 

Grama Ward Sachivalayam Salary: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు షాక్​.. అక్టోబరు జీతాల్లో కోత!

Grama Ward Sachivalayam Salary: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు (Grama Ward Sachivalayam) ఊహించని షాక్​ తగిలింది. రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వీరంతా.. ప్రొబేషన్​ ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో అనుకోని విధంగా ఈ ఉద్యోగుల జీతాల్లో కోత పడింది. బయోమెట్రిక్​ అటెండెన్స్​ లేదని అక్టోబరు జీతంలో కొందరికి 10 శాతం తగ్గించగా.. మరికొందరికి 50 శాతం జీతాన్ని కోత విధించారు.   

ఈ మేరకు సెప్టెంబరు 23 నుంచి అక్టోబరు 22 వరకు హాజరుకు సంబంధించిన డేటా జిల్లాలకు ఉన్నతాధికారులు పంపారు. వీటి ఆధారంగానే ఉద్యోగులకు జీతాలను చెల్లించాలని.. డ్రాయింగ్‌, డిజ్బర్స్‌మెంట్‌ అధికారుల (డీడీవో)ను గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ఆదేశించింది. క్షేత్రస్థాయిలో సాంకేతిక సమస్యలను పరిష్కరించకుండా హాజరు లేదని జీతాల్లో కోత విధించడంపై ఉద్యోగుల్లో (Grama Ward Sachivalayam Employees) ఆందోళన వ్యక్తమవుతోంది.
అయితే సాంకేతిక సమస్యలను సరిచేసి మరోసారి హాజరు, జీతాల డేటాలను రూపొందించాలని ఉద్యోగస్తులు విన్నవించుకుంటున్నారు. తామంతా విధులకు హాజరైనా.. ఇలా జరగడం బాధకరమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లోని ఉద్యోగులు ఇప్పటికే తమతమ మండల అధికారులకు వినతి పత్రాలను అందేస్తున్నారు. 

సిగ్నల్‌ సమస్యతో కొన్ని చోట్ల బయోమెట్రిక్‌ ఆన్‌లైన్‌ విధానం సరిగా పనిచేయక పోవడం, కొన్నిచోట్ల డివైజ్‌లు అందుబాటులో లేక దస్త్రాల్లోనే సంతకాలు చేయాల్సిరావడం తదితర సాంకేతిక సమస్యలు ఉన్నాయి. బయోమెట్రిక్‌ అటెండెన్స్​తో సంబంధం లేకుండా పాత పద్ధతిలోనే సిబ్బందికి జీతాలు చెల్లించాలని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ప్రొబేషన్‌ ప్రక్రియను పూర్తి చేసి రెగ్యులర్‌ స్కేల్‌ (Grama Ward Sachivalayam Salary) ఇవ్వాలని త్వరలోనే ప్రభుత్వానికి విన్నవించుకుంటామని తెలిపారు.  

Also Read: Weather update: ఏపీలో నేడు, రేపు మోస్తరు వర్షాలు

Also Read: pattabhi gets bail : పట్టాభికి బెయిల్‌, టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనలో 10 మంది అరెస్ట్‌ 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More