Home> ఏపీ
Advertisement

Telangana SSC Results: ఏపీలో తగ్గిన టెన్త్ ఉత్తీర్ణత.. తెలంగాణ ఫలితాలపై ఉత్కంఠ! రిలీజ్ ఎప్పుడంటే...

TS SSC INTER RESULTS: ఆంధ్రప్రదేశ్ లో పదవ తరగతి పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. దీంతో తెలంగాణలో రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయోనన్న ఉత్కంఠ నెలకొంది. తెలంగాణకు సంబంధించి ఎస్సెస్సీ, ఇంటర్ పరీక్షా పత్రాల వ్యాల్యూయేషన్ వేగంగా సాగుతోంది. వీలైనంత త్వరగా వ్యాల్యూయేషన్ పూర్తి చేసి ఫలితాలు ఇచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Telangana SSC Results: ఏపీలో తగ్గిన టెన్త్ ఉత్తీర్ణత.. తెలంగాణ ఫలితాలపై ఉత్కంఠ! రిలీజ్ ఎప్పుడంటే...

TS SSC INTER RESULTS: ఆంధ్రప్రదేశ్ లో పదవ తరగతి పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. దీంతో తెలంగాణలో రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయోనన్న ఉత్కంఠ నెలకొంది. తెలంగాణకు సంబంధించి ఎస్సెస్సీ, ఇంటర్ పరీక్షా పత్రాల వ్యాల్యూయేషన్ వేగంగా సాగుతోంది. వీలైనంత త్వరగా వ్యాల్యూయేషన్ పూర్తి చేసి ఫలితాలు ఇచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణలో మే 23 నుంచి పదవ తరగతి పరీక్షలు జరిగాయి. తెలంగాణలో టెన్త్ ఎగ్జామ్స్ కు దాదాపు 5 లక్షల 9 వేల  275 మంది విద్యార్ధులు హాజరయ్యారు. జూన్‌ 11వ తేదీ నాటికి వ్యాల్యుయేషన్‌ పూర్తి చేసి, నెలాఖరులోగా పదవ తరగతి పరీక్షా ఫలితాలను విడుదల చేస్తామని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు.

తెలంగాణలో ఇంటర్ పరీక్షలు మే 7న మొదలై మే 24 వరకు జరిగాయి. ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం కలిసి  9 లక్షల 7 వేల  393 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. తెలంగాణలో ఇంటర్‌ ప్రశ్నా పత్రాల వ్యాల్యుయేషన్‌ దాదాపుగా పూర్తయిందని తెలుస్తోంది. ఆన్ లైన్ ప్రాసెస్ జరుగుతుందని.. ఈ నెల 20లోగా ఇంటర్‌ పరీక్షా ఫలితాలను విడుదల చేయాలని ఇంటర్ బోర్డు అధికారులు ప్రయత్నిస్తున్నారు. గతంలో జరిగిన పొరపాట్లతో ఈసారి ఎలాంటి అవకతవలకు అవకాశం లేకుండా రిజల్స్ట్ ఇవ్వాలని అధికారులు శ్రమిస్తున్నారు. కాస్త ఆలస్యమైనా ఫర్వాలేదు కాని.. ఎలాంటి గందరగోళం లేకుండా చూడాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయంటున్నారు.

కొవిడ్ మహమ్మారి కారణంగా గత రెండేళ్లు పదవ తరగతి పరీక్షలు జరగలేదు. విద్యార్థులందరిని పాస్ చేసినట్లు ప్రకటించింది ప్రభుత్వం. కొవిడ్ కారణంగా గత రెండేళ్లు స్కూళ్లు కూడా సరిగా జరగలేదు. 2020-21లోస్కూళ్లు తెరుచుకోలేదు. 2021-22 సంవత్సరానికి గాను దాదాపు ఆరు నెలలు స్కూళ్లు నడిచాయి. కొవిడ్ ప్రభావంతో గత రెండేళ్లు క్లాసులు జరగపోవడంతో విద్యార్థులపై ఒత్తిడి పెరిగింది. దీంతో ఎస్సెస్సీ విద్యార్థులకు గతంలో 11 పేపర్లు ఉండగా.. ఈసారి 6 పేపర్లకు తగ్గించింది తెలంగాణ సర్కార్. పరీక్ష గడువును కూడా గతంలో కంటే పెంచింది. దీంతో పాటు టెన్త్ తో పాటు ఇంటర్ పరీక్షలకు సిలబస్ ను 70 శాతానికి తగ్గించింది ప్రభుత్వం. ఏపీలో టెన్త్ రిజల్ట్స్ గతంలో కంటే భారీగా తగ్గింది. దీంతో తెలంగాణ ఉత్తీర్ణత శాతం ఎలా ఉంటుదోనన్న ఆందోళన విద్యార్థులతో పాటు పేరంట్స్ లో కనిపిస్తోంది.  

Read also: Gang Rape Case: గ్యాంగ్ రేప్ కేసులో సంచలనం.. బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ పై కేసు

Read also: JP NADDA AP TOUR: బీజేపీతో జనసేన కటీఫేనా? పవన్ పొత్తులపై జేపీ నడ్డా తేల్చేస్తారా?  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Read More