Home> ఏపీ
Advertisement

Vivika Murder Case: అవినాష్ రెడ్డికి భారీ ఊరట, వివేకా హత్య కేసులో నో అరెస్టు ఆదేశాలు జారీ

Vivika Murder Case: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డికి ఊరట లభించింది. తదుపరి తీర్పు వెలువడేవరకూ అరెస్టు చేయవద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. మరోవైపు సీబీఐ విచారణపై స్టే విషయంలో తీర్పు రిజర్వ్ చేసింది. 

Vivika Murder Case: అవినాష్ రెడ్డికి భారీ ఊరట, వివేకా హత్య కేసులో నో అరెస్టు ఆదేశాలు జారీ

వైఎస్ వివేకా హత్యకేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి దాఖలు చేసిన పిటీషన్‌పై తెలంగాణ హైకోర్టులో ఇరుపక్షాల వాదనల అనంతరం కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. అప్పుడే అరెస్టు చేయవద్దని సీబీఐని ఆదేశించడం ద్వారా అవినాష్ రెడ్డికి ఊరటనిచ్చింది.

కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి దాఖలు చేసిన పిటీషన్‌పై తెలంగాణ హైకోర్టులో ఇవాళ అంటే మార్చ్ 13న విచారణ జరిగింది. వివేకా హత్య కేసులో తనపై తీవ్ర చర్యలు తీసుకోవద్దన్న అవినాష్ రెడ్డి పిటీషన్‌పై తీర్పును హైకోర్టు ఇవాళ రిజర్వ్ చేసింది. కేసు తదుపరి విచారణపై స్టే విషయంలో తీర్పును సైతం కోర్టు రిజర్వ్‌లో పెట్టింది. ఈ వ్యవహారంలో తదుపరి తీర్పు వెల్లడించేవరకూ ఆరెస్టు చేయవద్దని సీబీఐని ఆదేశించింది.

పార్లమెంట్ సమావేశాల నేపధ్యంలో సీబీఐ విచారణకు హాజరుకాకుండా ఆదేశాలివ్వాలని కోరగా..సీబీఐకు లేఖ పెట్టుకోవాలని హైకోర్టు సూచించింది. సీబీఐ కార్యాలయం వెలుపల అవినాష్ రెడ్డి మీడియా సమావేశం పెట్టడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సునీత పిటీషన్, అభియోగాల వెనుక సీబీఐ హస్తం, రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయని ..వివేకా అల్లుడు రాజశేఖర్ రెడ్డి, వివేకా రెండవ భార్య షమీం పాత్రపై సీబీఐ ఎందుకు విచారణ చేయలేదని అవినాష్ రెడ్డి తరపు న్యాయవాది ప్రశ్నించారు. 

మరోవైపు వివేకా హత్యకేసు డైరీని సీల్డ్ కవర్‌లో తెలంగాణ హైకోర్టుకు సమర్పించింది సీబీఐ. 35 మంది సాక్షుల స్టేట్‌మెంట్స్,, 10 డాక్సుమెంట్స్, హార్డ్‌డిస్క్‌లతో పాటు సంఘటనా స్థలంలో లభించిన లేఖను కూడా కోర్టుకు సమర్పించింది సీబీఐ.

Also read: AP MLC Elections: ఆంధ్రప్రదేశ్ లో నేడే ఎమ్మెల్సీ ఎన్నికలు.. మెుదలైన పోలింగ్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More