Home> ఏపీ
Advertisement

AP secretariat : ఏపీ సచివాలయ ఉద్యోగులకు టి సర్కార్ లైన్ క్లియర్

లాక్ డౌన్ ( Lockdown ) సమయంలో హైదరాబాద్‌లో చిక్కుకుపోయిన ఏపీ సచివాలయ ఉద్యోగులు ( AP secretariat employees ), హైదరాబాద్‌లోనే కుటుంబాలతో కలిసి ఉంటున్న ఏపీ సచివాలయ ఉద్యోగులకు తిరిగి అమరావతి చేరేందుకు మార్గం సుగమం అయింది.

AP secretariat : ఏపీ సచివాలయ ఉద్యోగులకు టి సర్కార్ లైన్ క్లియర్

అమరావతి : లాక్ డౌన్ ( Lockdown ) సమయంలో హైదరాబాద్‌లో చిక్కుకుపోయిన ఏపీ సచివాలయ ఉద్యోగులు ( AP secretariat employees ), హైదరాబాద్‌లోనే కుటుంబాలతో కలిసి ఉంటున్న ఏపీ సచివాలయ ఉద్యోగులకు తిరిగి అమరావతి చేరేందుకు మార్గం సుగమం అయింది. హైదరాబాద్‌ నుంచి అమరావతి వెళ్లేందుకు తెలంగాణ సర్కార్ ( Telangana govt ) నుంచి అనుమతి లభించింది. సచివాలయ ఉద్యోగుల కోసం ఏపీ ప్రభుత్వం ( AP govt ) ఏర్పాటు చేస్తున్న బస్సులకు సరిహద్దులు దాటేందుకు ప్రత్యేక అనుమతి ఇవ్వాల్సిందిగా తెలంగాణ సీఎస్‌ సోమేష్‌కుమార్‌కు ( Telangana CS Somesh Kumar ) ఏపీ సీఎస్‌ నీలం సాహ్ని ( AP CS Nilam Sawhney ) ఓ లేఖ రాశారు. (Read also : తెలంగాణలో 2 వేలకు సమీపంలో కరోనా కేసులు )

ఏపీ సర్కార్ నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు ఏపీ సచివాలయ ఉద్యోగుల బస్సులకు అనుమతి మంజూరు చేస్తూ సీఎస్‌ సోమేష్‌ కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. బుధవారం ఏపీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో ( APSRTC buses) 400 మంది ఏపీ సెక్రటేరియట్ ఎంప్లాయిస్ అమరావతి చేరుకోనున్నారు. మియాపూర్‌, కేపీహెచ్‌బీ, లక్డీకపూల్‌, ఎల్బీనగర్‌ ప్రాంతాల నుంచి ఏపీఎస్‌ ఆర్టీసీ అధికారులు 10 బస్సులను ఏర్పాటు చేసినట్టు సమాచారం. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Read More