Home> ఏపీ
Advertisement

Kodali Nani: కొడాలి నాని, వల్లభనేని వంశీపై మహిళను వేధించిన కేసు!

Kodali Nani: మాజీ మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే  వల్లభనేని వంశీపై కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్ లో తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి మూల్పూరి కల్యాణి ఫిర్యాదు చేశారు.

Kodali Nani: కొడాలి నాని, వల్లభనేని వంశీపై మహిళను వేధించిన కేసు!

Kodali Nani: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏది జరిగినా సంచలనమే. పదవ తరగతి ఫలితాలపై ఏపీలో రచ్చ సాగుతోంది. ఫెయిలైన విద్యార్థులు రోడ్డెక్కారు. పదవ తరగతి ఫలితాలపై ఉద్యమిస్తోంది తెలుగు దేశం పార్టీ. బాధిత విద్యార్థులతో నారా లోకేష్ జూమ్ మీటింగ్ నిర్వహించగా.. లైవ్ లో వచ్చి షాకిచ్చారు మాజీ మంత్రి కొడాలి నాని, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశి. ఈ ఘటనపై టీడీపీ శ్రేణులు తీవ్రంగా స్పందించాయి. తాజాగా కొడాలి నాని, వల్లభనేని వంశీపై వేధింపుల ఆరోపణలు వస్తున్నాయి. ఓ మహిళ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం కలకలం రేపుతోంది.

మాజీ మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే  వల్లభనేని వంశీపై కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్ లో తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి మూల్పూరి కల్యాణి ఫిర్యాదు చేశారు.కొడాలి నాని, వంశీతో పాటు వాళ్ల అనుచరులు సోషల్ మీడియా ద్వారా తనను వేధిస్తున్నారని ఆమె తన ఫిర్యాదులో ఆరోపించారు. రాచేటి రూతమ్మ అనే మహిళ తనకు ఫోన్ చేసి బెదిరించారని, నానా బూతులు తిడుతూ భయపెట్టిందని కల్యాణి చెబుతున్నారు. రూతమ్మ బెదిరింపులకు సంబంధించిన ఆడియా కాల్ ను పోలీసులు సమర్పించారు. రూతమ్మతో పాటు కొడాలి నాని, వల్లభనేని వంశీపై చర్యలు తీసుకోవాలని హనుమాన్‌జంక్షన్‌ పోలీసులను కోరారు.

గత నెల 28 ఎన్టీఆర్‌ జయంతి రోజున గన్నవరంలో వైసీపీ నేతలు భారీగా ఫ్లెక్సీలు, బ్యానర్లు కట్టారు. ఎన్టీఆర్ విగ్రహం కనిపించకుండా వైసీపీ నేతలు బ్యానర్లు కట్టారని కల్యాణి నిలదీశారు. అప్పటి నుంచి తనను వంశీ వర్గీయులు టార్గెట్ చేస్తున్నారని కల్యాణి ఆరోపించారు. సోషల్ మీడియాలో తనను తిడుతూ పోస్టులు పెడుతున్నారని, వీడియోలు షేర్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈనెల 10న తనను బెదిరిస్తూ, బూతులు తిడుతూ మాట్లాడిన ఆడియోను వాట్సాప్ లో పంపారని పోలీసులకు తెలిపారు. గన్నవరానికి చెందిన రూతమ్మ ఈ మాటలు మాట్లాడినట్లు తమ పరిశీలనలో తేలిందని తెలపారు. జగన్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించినందుకే తనను టార్గెట్ చేశారని ఆరోపించిన కల్యాణి.. కొడాలి నాని, వంశీతో పాటు రూతమ్మపై కేసు నమోదు చేయాలని పోలీసులను కోరారు.

Read also: CM KCR: కేసీఆర్ ఆ పని చేస్తే రేవంత్ రెడ్డికి గండమే..? తెలంగాణలో ఏం జరగబోతోంది..

Read also Prophet Row Protests: 'ప్రవక్త'పై అనుచిత వ్యాఖ్యల చిచ్చు.. ఆందోళనలు హింసాత్మకం.. రాంచీలో ఇద్దరి మృతి  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Read More