Home> ఏపీ
Advertisement

Nimmala Rama Naidu: సైకిల్‌ యాత్ర చేస్తూ.. ప్రమాదవశాత్తు జారిపడిన టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల!!

TDP MLA Nimmala Rama Naidu slips form Bicycle. టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు సైకిల్‌ యాత్ర చేస్తూ ప్రమాదవశాత్తు జారిపడ్డారు. ఈ ఘటనలో నిమ్మల ఎలాంటి గాయాలు కాలేదని సమాచారం. 

Nimmala Rama Naidu: సైకిల్‌ యాత్ర చేస్తూ.. ప్రమాదవశాత్తు జారిపడిన టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల!!

TDP MLA Nimmala Rama Naidu slips form Bicycle: టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు సైకిల్‌ యాత్ర చేస్తూ ప్రమాదవశాత్తు జారిపడ్డారు. రోడ్డుపై సైకిల్‌ తొక్కుకుంటూ వస్తుండగా.. పక్కన ఉన్న కార్యకర్త సైకిల్‌ తగలడంతో.. ఒక్కసారిగా కిందిపడిపోయారు. వెంటనే కార్యకర్తలు వచ్చి ఆయనను పైకి లేపారు. ఈ ఘటనలో నిమ్మలకు ఎలాంటి గాయాలు కాలేదని సమాచారం. కొద్దిపాటి విరామం అనంతరం నిమ్మల తన సైకిల్‌ యాత్ర కొనసాగించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలు మండలం గుండుగోల సమీపంలో ఈ ఘటన జరిగింది.

టీడీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించిన టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు వెంటనే అందజేయాలని డిమాండ్ చేస్తూ.. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు సైకిల్ యాత్ర మొదలెట్టిన విషయం తెలిసిందే. పాలకొల్లు టిడ్కో ఇళ్ల నుంచి అమరావతి అసెంబ్లీ వరకు శుక్రవారం సైకిల్‌ యాత్రకు నిమ్మల శ్రీకారం చుట్టారు. లబ్ధిదారుల ఆవేదనను అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో ప్రస్తావించేందుకు సైకిల్‌పై అసెంబ్లీకి వెళుతున్నట్టు నిమ్మల చెప్పారు. 

శుక్రవారం నిమ్మల రామానాయుడు చేపట్టిన సైకిల్ యాత్రకు పశ్చిమగోదావరి జిల్లాలో విశేష ఆదరణ లభిస్తోంది. నిన్న పాలకొల్లు నుంచి బయలుదేరిన నిమ్మల..ఈ రోజు భీమడోలు మండలంకు చేరుకున్నారు. సైకిల్ యాత్ర నిర్వహిస్తున్న నిమ్మలకు అభిమానులు హయ్ చెప్పగా.. ఆయన కూడా స్పందించారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే నిమ్మల కిందిపడిపోయారు. దాంతో ఆయన కాలికి స్వల్ప గాయమైందని తెలుస్తోంది. ప్రాథమిక చికిత్స అనంతరం నిమ్మల తన సైకిల్ యాత్రను కొనసాగించారు.

Also Read: Khiladi OTT Release Date: ఖిలాడి ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచో తెలుసా?

Also Read: Viral Video: పెళ్లి ఊరేగింపులో 'శ్రీవల్లి' ఫీవర్.. హుక్ స్టెప్‌తో ఊగిపోయిన యువకులు! రచ్చ మాములుగా లేదుగా!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Read More