Home> ఏపీ
Advertisement

MLA Adimulam: మగరాయుళ్లా...మగువరాయుళ్లా..! రాజకీయాల్లో రసిక రాజులు..!

MLA Adimulam: మగువ మత్తులో పడి ఏపీ నేతలు చిత్తవుతున్నారు. సభ్య సమాజానికి ఆదర్శంగా ఉండాల్సిన ప్రజా ప్రతినిధులు పనికిమాలిన పనులతో అడ్డంగా బుక్ అవుతున్నారు.ఒకరి తరువాత ఒకరి రాసలీల వ్యవహారం ఏపీ రాజకీయాలను కుదిపేస్తుంది.అధికార, ప్రతిపక్షాలంటూ సంబంధం లేకుండా నేతల బండారం బయటకు వస్తుండడం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారుతుంది. చెప్పేవి నీతులు చేసేది మరొకటి అన్నట్లుగా నేతల తీరు ఉందని ప్రజలు మండిపడుతున్నారు.

MLA Adimulam: మగరాయుళ్లా...మగువరాయుళ్లా..! రాజకీయాల్లో రసిక రాజులు..!

MLA Adimulam: ఆంధ్ర ప్రదేశ్  రాజకీయాల్లో ఇప్పుడు సెక్స్ వీడియోల కలకలం రేపుతుంది. ఏకంగా అధికార పార్టీకీ చెందిన ఎమ్మెల్యే సెక్స్ వీడియో వైరల్ కావడం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. కొద్ది రోజుల క్రితమే వైసీపీకీ చెందని ఇద్దరి ఎమ్మెల్సీల రాసలీల వ్యవహారం మరవక ముందే తాజాగా టీడీపీకీ చెందిన ఎమ్మెల్యే వీడియో రాజకీయంగా పెను దుమారం రేపుతుంది. ఏకంగా ఎమ్మెల్యే ఒక మహిళ అందులోను పార్టీ కార్తకర్తతో రొమాన్స్ చేయడం సెన్సేషనల్ గా మారింది. ఒక వైపు ఏపీలో వరదల రాజకీయం కొనసాగుతుండగా ఎమ్మెల్యే సెక్స్ వీడియో బయటకు రావడం రాజకీయ రచ్చకు వేదిక మారింది.

కేవలం వీడియోనే కాదు ఆ మహిళ మీడియా ముందుకు వచ్చి ఎమ్మెల్యే ఆదిమూలంపై సంచలన ఆరోపణలు చేసింది. తాను ఎమ్మెల్యే బాధితురాలిని..నన్ను ఎమ్మెల్యే లైంగికంగా వేధించారని..తనపై ఎమ్మెల్యే మూడు సార్లు అత్యాచారం చేశారని మహిళ ఆరోపించడం అందరినీ షాక్ గురి చేసింది. మహిళ ఆరోపణలకు బలం చేకూరేలా వీడియోలు ఉండడంతో అధికార పార్టీ ఇరకాటంలో పడింది. ఒక వైపు చంద్రబాబు విజయవాడ వరదల్లో తీరిక లేకుండ శ్రమిస్తుంటే..ఈ వార్త తెలిసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలవగానే ఎమ్మెల్యేను తక్షణమే పార్టీ నుంచి బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

అప్పటికే మీడియాలో ఎమ్మెల్యే వ్యవహారం హల్ చల్ చేస్తుండడంతో టీడీపీకీ వెంటనే స్పందించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏ మాత్రం ఆలస్యం చేసినా రాజకీయంగా తీవ్ర నష్టం కలుగుతుందనే అభిప్రాయం  పార్టీలో ఏర్పడింది. దీంతో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఎమ్మెల్యే ఆదిమూలంను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్యేను పార్టీ నుంచి సస్పెండ్ చేసినా రాజకీయంగా ఏమైనా నష్టం జరుగుతుందా అన్న భావనలో తెలుగు దేశం పార్టీలో అంతర్మథనం మొదలైంది.

ఒక వైపు విజయవాడ వరద పనుల్లో నిద్రహారాలు మాని పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు పర్యవేక్షిస్తుంటే...ఎమ్మెల్యే ఇలా దిగజారి ప్రవర్తిచడం ఏంటని సొంత పార్టీ నుంచే విమర్శలు వినపడుతున్నాయి. ఎమ్మెల్యే తీరుతో పార్టీ పరువు పోయిందని కొందరు పార్టీ నేతలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. మరోవైపు ఎమ్మెల్యే ఐనా ఎంత పెద్ద నాయకుడు ఐనా సరే పార్టీ లైన్ తప్పితే చర్యలు తప్పవంటూ అధిష్టానం నేతలను హెచ్చిరించింది.

టీడీపీ ఎమ్మెల్యే తీరు ఇలా ఉంటే..వైసీపీ ఎమ్మెల్సీల కథ మరోలా ఉంది. వైసీపీకీ చెందిన ఇద్దరి ఎమ్మెల్సీలు వ్యవహారం కూడా ఇదే తీరుగా ఉంది. ఒకరమే ఏకంగా ఇంట్లోనే దుకాణం పెట్టగా మరొకరేమో వీడియో కాల్ లో రొమాంటిక్ గా మాట్లాడుతూ అడ్డంగా దొరికిపోయారు. దువ్వాడపై  వైసీపీ అధిష్టానం చర్యలు తీసుకోగా...అనంత బాబు విషయంలో మాత్రం ఇంకా వేచి చూఏ ధోరణిలో ఉంది. ఇలా అధికార ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ఇలా రాసలీల వ్యవహారంలో బయటపడుతుండడం ఏపీలో ఇప్పుడు పెద్ద చర్చకు దారితీస్తుంది. దువ్వాడ, అనంత బాబు, అంబటి రాంబాబు తాజాగా ఆదిమూలం..తర్వాత ఎవరి వంతు అని జనాలు చర్చించుకుంటున్నారు. ఇలా కొంత మంది నేతల తీరుతో రాజకీయ వ్యవస్థ అంటేనే జనం చీదరించుకునేలా తయారయ్యింది.నేతలు ఎవ్వరూ ఇలాంటి వక్రబుద్దులకు పోకుండా ఉండాలంటే కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ వినపడుతుంది.

(ఇందుప్రియాల రాధాకృష్ణ)

ఇదీ చదవండి:  పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్నా లెజ్నెవా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తెలుసా..!

ఇదీ చదవండి:  పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకోవడానికి కారణమేమిటంటే..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Read More