Home> ఏపీ
Advertisement

పార్టీ బలోపేతం కోసం చంద్రబాబు జిల్లా పర్యటనలు !!

ఏపీలో టీడీపీ బలోపేతం దిశగా చంద్రబాబు అడుగులు వేస్తున్నారు

పార్టీ బలోపేతం కోసం చంద్రబాబు జిల్లా పర్యటనలు !!

టీడీపీ అధినేత ఏపీలో పార్టీ బలోపేతంపై దృష్టి సారించారు. ఈ సందర్భంగా జిల్లా పర్యటనలకు షెడ్యూల్ ప్రిపేర్ చేసుకున్నారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో పర్యటించాలని భావిస్తున్న చంద్రబాబు.. ప్రతి వారంలో రెండ్రోజుల పాటు పర్యటిస్తారని సమాచారం. జిల్లా కేంద్రంలోనే రెండ్రోజులు చంద్రబాబు మకాం వేసి.. నియోజకవర్గాల వారీగా సమస్యలపై సమీక్షలు నిర్వహించడం... కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తారని సమాచారం. అలాగే టీడీపీ జిల్లా సర్వసభ్య సమావేశంలో పాల్గొంటారు. ఇదిలా ఉంటే సెప్టెంబర్ 5, 6 తేదీల్లో తూ.గో. జిల్లా నుంచి పర్యటన చేస్తారని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఏపీ జిల్లా పర్యటనలతో పాటు తెలంగాణ ప్రాంతంలో కూడా పర్యటించాలని చంద్రబాబు నిర్ణయించినట్లు తెలిసింది. 
 

Read More