Home> ఏపీ
Advertisement

Raghuramakrishnam raju episode: రఘురామకృష్ణంరాజుకు సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు

Raghuramakrishnam raju episode: రఘురామకృష్ణంరాజుకు నిరాశే ఎదురైంది. రమేష్ ఆసుపత్రిలో వైద్య పరీక్షలకు అనుమతి లభించలేదు. ఆ ఆసుపత్రిలోనే వైద్య పరీక్షలు చేయించాలని సర్వోన్నత న్యాయస్ఖానం ఆదేశాలు జారీ చేసింది. బెయిల్ పిటీషన్‌పై విచారణ వాయిదా పడింది.
 

Raghuramakrishnam raju episode: రఘురామకృష్ణంరాజుకు సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు

Raghuramakrishnam raju episode: రఘురామకృష్ణంరాజుకు నిరాశే ఎదురైంది. రమేష్ ఆసుపత్రిలో వైద్య పరీక్షలకు అనుమతి లభించలేదు. ఆ ఆసుపత్రిలోనే వైద్య పరీక్షలు చేయించాలని సర్వోన్నత న్యాయస్ఖానం ఆదేశాలు జారీ చేసింది. బెయిల్ పిటీషన్‌పై విచారణ వాయిదా పడింది.

ఏపీ(AP)లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (Ysr Congress party) ఎంపీ, తిరుగుబాటు నేత రఘురామకృష్ణంరాజు (Raghuramakrishnam raju) అరెస్టు వ్యవహారం సంచలనమైంది. అరెస్టు చేసిన తరువాత తనను పోలీసులు కొట్టారంటూ ఆరోపించడం వివాదాస్పదమైంది. అయితే గుంటూరు వైద్యులు మాత్రం ఎంపీపై చేయిచేసుకున్న దాఖలాలు లేవని స్పష్టం చేశారు. విజయవాడ రమేశ్ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకుంటాననడంతో ఏపీ ప్రభుత్వం (Ap government) అభ్యంతరం తెలిపింది. రమేశ్ ఆసుపత్రిపై క్రిమినల్ కేసులున్నాయని వాదించింది. రమేశ్ ఆసుపత్రి అంటే టీడీపీ కార్యాలయం కిందే లెక్కని వాదించింది. 

ఈ నేపధ్యంలో సమీపంలో ఆర్మీ ఆసుపత్రులున్నాయా అని సుప్రీంకోర్టు (Supreme Court) ప్రశ్నించగా..3 వందల కిలోమీటర్ల దూరంలో సికింద్రాబాద్‌లో ఆర్మీ ఆసుపత్రి, విశాఖలో నేవీ ఆసుపత్రి ఉన్నాయని తెలిపింది. విశాఖలో తుపాను పరిస్థితులున్నాయని..కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో నడుస్తున్న మంగళగిరిలోని ఎయిమ్స్ వైద్య కళాశాల అతి దగ్గరలో ఉందని తెలిపింది. లేదా రఘురామకృష్ణంరాజుకు ఎయిమ్స్ లో వైద్య పరీక్షలకు అభ్యంతరం లేదన్నారు. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు  సికింద్రాబాద్‌లోని ఆర్మీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించాలని ఆదేశించింది. ఈ పరీక్షల్ని జ్యుడిషియల్ అధికారి ఆద్వర్యంలో జరగాలని..ఆ ఆధికారిని తెలంగాణ హైకోర్టు (Telangana High Court) నియమించాలని సూచించింది. వైద్య పరీక్షల్ని రఘురామకృష్ణంరాజే భరించాలని ఆదేశించింది. నివేదికను సీల్డు కవర్‌లో ఇవ్వాలని చెబుతూ..విచారణను వాయిదా వేసింది.

Also read: Ap Curfew Extension: ఏపీలో కర్ఫ్యూ మే 31 వరకూ పొడిగింపు, గ్రామీణ ప్రాంతాల్లో మరింత కట్టుదిట్టం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More