Home> ఏపీ
Advertisement

Andhra Pradesh: ఒక్క పూటే పాఠశాలలు: మంత్రి సురేష్

ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) లో రేపటి నుంచి బడి గంటలు మోగనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం కూడా అన్నిరకాల చర్యలు తీసుకుంటోంది. అయితే ఆయా జిల్లాల్లో కలెక్టర్లు, ఇతర అధికారులు నిరంతరం పాఠశాలలను పర్యవేక్షించేలా ప్రభుత్వం ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. 

Andhra Pradesh: ఒక్క పూటే పాఠశాలలు: మంత్రి సురేష్

Schools reopen in Andhra Pradesh from tomorrow: అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) లో రేపటి నుంచి బడి గంటలు మోగనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం కూడా అన్నిరకాల చర్యలు తీసుకుంటోంది. అయితే ఆయా జిల్లాల్లో కలెక్టర్లు, ఇతర అధికారులు నిరంతరం పాఠశాలలను పర్యవేక్షించేలా ప్రభుత్వం ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. ఈ క్రమంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ (Adimulapu Suresh) ప్రకాశం జిల్లాలో ఆదివారం మాట్లాడారు. సోమవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు తెరుచుకుంటాయని (Schools will reopen) ఆయన తెలిపారు. మొదటగా 9,10 విద్యార్థులకు తరగతులు (9th, 10th Clases) ప్రారంభించనున్నట్లు సురేష్ వివరించారు. Also read: AP Schools, Colleges: స్కూల్, కాలేజీల్లో పాఠాలు మొదలయ్యే తేదీలివే

ఆ తర్వాత ఈ నెల 23 నుంచి 6, 7, 8 తరగతుల క్లాస్‌లు ప్రారంభమవుతాయని సురేష్ వెల్లడించారు. దశలవారీగా అన్ని తరగతులు ప్రారంభిస్తామని దీనికోసం ప్రాణాళికలు రూపొందించినట్లు ఆయన వివరించారు. అయితే కోవిడ్ 19 (Coronavirus) నిబంధనల ప్రకారం పాఠశాలల నిర్వహణ జరుగుతుందని తెలిపారు. ఈ ఏడాది తగ్గించిన సిలబస్‌ ప్రకారం విద్యా సంవత్సరం పూర్తిచేయనున్నట్లు వివరించారు. 

విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా రాష్ట్రవ్యాప్తంగా రక్షణ చర్యలు చేపట్టామని.. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన పేర్కొన్నారు. ప్రస్తుతం ఒక పూట (off day school) మాత్రమే తరగతులను నిర్వహిస్తామని తెలిపారు. మధ్యాహ్న భోజనం అనంతరం విద్యార్థులను ఇళ్లకు పంపిస్తామని మంత్రి సురేష్‌ పేర్కొన్నారు. Also Read:  AP Ration Cards: 35 రోజుల్లోనే 6 లక్షల రేషన్ కార్డులు జారీ చేసి ఏపి ప్రభుత్వం

 

A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

IOS Link - https://apple.co/3loQYeR

Read More