Home> ఏపీ
Advertisement

RBI on AP: ఆర్బీఐ దగ్గర ఏపీ ప్రభుత్వం మారోమారు భారీగా అప్పు..ఆ సొమ్ము ఎంతంటే..!

RBI on AP: ఏపీలో ప్రభుత్వం చేస్తున్న అప్పులపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దీనిపై అధికార పార్టీ, ప్రతిక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా అప్పుల విషయంలో జగన్‌ ప్రభుత్వ కీలక నిర్ణయం తీసుకుంది.

RBI on AP: ఆర్బీఐ దగ్గర ఏపీ ప్రభుత్వం మారోమారు భారీగా అప్పు..ఆ సొమ్ము ఎంతంటే..!

RBI on AP: ఏపీ ప్రభుత్వం మరో రూ.వెయ్యి కోట్ల అప్పు తీసుకుంది. ఈవిషయాన్ని ఆర్బీఐ వెల్లడించింది. సెక్యూరిటీ వేలం ద్వారా రూ.500 కోట్ల చొప్పున రెండు లాట్లలకు వేలం నిర్వహించారు. 13  ఏళ్ల కాల పరిమితితో  7.72 శాతం వడ్డీకి వేలం చేపట్టారు. దీని ద్వారా ఏపీ ప్రభుత్వానికి రూ.వెయ్యి కోట్ల రుణం పొందింది. దీనిపై ఆర్బీఐ అధికారిక ప్రకటన వెలువరించింది. సెక్యూరిటీల వేలం ద్వారా జులై 21 వరకు రూ.21 వేల 500 కోట్ల రుణాన్ని జగన్ ప్రభుత్వం తీసుకుంది. 

ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం ప్రకారం ఇటీవల కేంద్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. ఆరు నెలల గడవక ముందే ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం ద్వారా మరోసారి భారీగా రుణం తీసుకుంది. ప్రతి మంగళవారం సెక్యూరిటీల వేలాన్ని ఆర్బీఐ నిర్వహిస్తోంది. ఈ వేలంలో ఏపీ ప్రభుత్వం పాల్గొని రూ.వెయ్యి కోట్ల అప్పును తీసుకుంది. ఇప్పటివరకు వేల కోట్ల అప్పులను రాష్ట్ర ప్రభుత్వం చేసిందని ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఆరోపిస్తోంది.

ఏపీలో ప్రతి ఒక్కరిపై వేలల్లో అప్పులు ఉన్నాయని అంటోంది. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ..అప్పటి నుంచి పథకాల పేరుతో అప్పులు చేస్తోందని మండిపడుతోంది. కార్పొరేషన్‌ నిధులను సైతం దుర్వినియోగం చేస్తోందని విమర్శిస్తోంది. అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తోంది. తాజాగా మరోమారు ఏపీ ప్రభుత్వం అప్పులు చేయడంతో రాజకీయాలు హీటెక్కాయి. ఎందు కోసం అప్పులు చేస్తున్నారో చెప్పాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. 

Also read:Karimnagar: అలుగునూరులో హృదయ విదారక ఘటన..తల్లి మృతదేహం వద్ద చిన్నారుల వేదన..!

Also read:Viral Video: నాగిని డ్యాన్స్‌ ఇరగదీసిన పోలీసులు..వారికి అందిన రివార్డు ఏంటో తెలుసా..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More