Home> ఏపీ
Advertisement

అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ  రాష్ట్రాల్లో సోమ, మంగళ వారాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది.

అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ  రాష్ట్రాల్లో సోమ, మంగళ వారాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. తమిళనాడు నుంచి ఒడిశా వరకు ఉపరితల ద్రోణి బలహీనంగా కొనసాగుతున్నట్లు.. దీని ప్రభావంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలలోని పలు ప్రాంతాల్లో నేడు, రేపు రెండు రోజుల పాటు ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది.

శ్రీశైలం, నాగార్జున సాగర్ గేట్లు ఎత్తివేత

అటు కృష్ణానది ఎగువ పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు భారీగా వరదనీరు పోటెత్తడంతో శ్రీశైలం, నాగార్జునసాగర్‌ జలాశయాలు నిండుకుండల్లా నీటితో కళకళలాడుతున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టుకు 1.83 లక్షల క్యూసెక్కులు చేరుకోగా...అక్కడి నుంచి అంతే మొత్తంలో నాగార్జునా సాగర్‌కు నీటిని విడుదల చేస్తున్నారు. నాలుగేళ్ల తర్వాత నాగార్జున సాగర్కు నీరు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకోవడంతో అధికారులు రెండు గేట్లు 5 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 595 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 586 అడుగులుగా ఉంది. మరోవైపు సాగర్ నుంచి వదులుతున్న నీటితో పులిచింతల కూడా ఫుల్ అవుతుందని అధికారులు అంచనావేస్తున్నారు. నాగార్జునసాగర్‌ నుంచి నీటి విడుదల సమాచారంతో గుంటూరు జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది.

Read More