Home> ఏపీ
Advertisement

Railway Budget: రైల్వే బడ్జెట్ లో ఏపీ, తెలంగాణకు భారీ నిధుల కేటాయింపు..

RailWay Budget: కేంద్ర బడ్జెట్ లో ఏపీ, బిహార్ లకు అధిక కేటాయింపులు చేసిన కేంద్రం..తాజాగా రైల్వే బడ్జెట్ లో కూడా తెలుగు రాష్ట్రాలకు తగినంత ప్రాధాన్యత ఇచ్చింది. మొత్తంగా ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతితో పాటు తెలంగాణలోని కీలక ప్రాజెక్ట్ లకు భారీగా నిధులు కేటాయించారు.  

Railway Budget: రైల్వే బడ్జెట్ లో ఏపీ, తెలంగాణకు భారీ నిధుల కేటాయింపు..

RailWay Budget: కేంద్ర బడ్జెట్ తో తెలంగాణకు ఏమి ఇవ్వలేదని రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంటే.. కేంద్రం మాత్రం అన్ని రాష్ట్రాలకు సమాన ప్రాధాన్యత ఇచ్చినట్టు చెప్పుకొచ్చింది. అంతేకాదు బడ్జెట్ తో రాష్ట్రాల పేర్లు ప్రస్తావించనంత మాత్రానా.. ఇవ్వనట్టు కాదని గట్టి కౌంటరే ఇచ్చారు. అంతేకాదు యువత, వ్యవసాయంతో పాటు కేంద్రం కేటాయించే పీఎం ఆవాస యోజన పథకాల్లో తెలంగాణ సహా అన్ని రాష్ట్రాల్లో సమ ప్రాధాన్యత ఇచ్చినట్టు చెప్పారు.  

అంతేకాదు తెలంగాణకు రైల్వే బడ్జెట్ తో రూ. 5,336 కోట్ల కేటాయించినట్టు కేంద్ర రైల్వై శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ తెలిపారు. అంతేకాదు గత యూపీఏ గవర్నమెంట్ లో వెయ్యి కోట్ల కంటే తక్కువ నిధులు కేటాయించిన విషయాన్ని ప్రస్తావించారు. ఈ సారి రైల్వే బడ్జెట్ తో ఆరు రెట్లు నిధులు పెంచినట్టు చెప్పారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రూ. 32,946 కోట్లఅభివృద్ధి పనులు వివిధ ప్రాంతాల్లో జరుగుతున్నట్టు చెప్పుకొచ్చారు. సికింద్రాబాద్ స్టేషన్ ఆధునీకరణతో పాటు చర్లపల్లి రైల్వే స్టేషన్ టర్నినల్ ఏర్పాటు పనుల పూర్తయినట్టు తెలిపారు.  రాష్ట్ర వ్యాప్తంగా రైల్వే విద్యుదీకరణ 100 శాతం పూర్తైయిందన్నారు. మరోవైపు తెలంగాణలో అన్ని లెవల్ క్రాసింగ్స్ వద్ద ఫ్లై ఓవర్ బ్రిడ్డులతో పాటు అండర్ పాస్ లు పూర్తైయినట్టు తెలిపారు.
అంతకాదు నగరం చుట్టూ రైల్వే రింగ్ ప్రాజెక్ట్ నిర్మాణంపై సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నట్టు చెప్పారు.

 హైదరాబాద్ లోని ఎంఎంటీఎస్ సర్వీస్ అద్భుతంగా పనిచేస్తుందన్నారు. ప్రాజెక్ట్ విస్తరణలో భాగంగా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల మధ్య ఉన్న సమస్యను పరిష్కరించాల్సి ఉందన్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ ల పురోగతిపై రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నామన్నారు. అంతేకాదు తెలంగాణలో సిమెంట్ ఫ్యాక్టరీలు ఎక్కువగా ఉన్నాయి. వీటి కోసం డెడికేటెడ్ రైల్వే కారిడార్లను నిర్మించబోతున్నట్టు చెప్పారు. వాటిని పీఎం గతిశక్తి ప్రాజెక్ట్ పోర్టల్ లో ఉంచబోతున్నట్టు చెప్పారు. అంతేకాదు అవసరమైన చోట రైల్వే లైన్ డబ్లింగ్.. ట్రిప్లింగ్ పనులు ఇప్పటికే చేపట్టమన్నారు. రైల్వేలో భద్రతా పరమైన చర్యల కోసం దాదాపు లక్ష కోట్లు కేటాయించినట్టు తెలిపారు.

గత యూపీఏ ప్రభుత్వ హయాంతో పోలిస్తే.. రైల్వే ప్రమాదాలు 60 శాతం తగ్గాయి. కవచ్ ను దేశ వ్యాప్తంగా అన్ని రైల్వే జోన్లకు అనుసంధానిస్తామన్నారు. అంతేకాదు ఏపీలో రాజధాని అమరావతికి రూ. 2 వేల కోట్లతో అభివృద్ది చేయనున్నట్టు చెప్పారు. అంతేకాదు రైల్వే బడ్జెట్ లో ఏపీకి రూ. 9151 కోట్లు కేటాయించినట్టు తెలిపారు. అంతేకాదు కృష్ణానదిపై మరో భారీ వంతెన నిర్మించబోతున్నట్టు తెలిపారు. అంతేకాదు 50 యేళ్ల అభివృద్దిని దృష్టిలో పెట్టుకొని విజయవాడ రైల్వే స్టేషన్ ను అభివృద్ది చేస్తున్నట్టు తెలిపారు. త్వరలో విశాఖ పట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ను ఏర్పాటుకు భూమిని కేటాయించాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరారు

మొత్తంగా ఆంధ్ర ప్రదేశ్ లో 73,743 కోట్ల విలువైన రైల్వై పనులు జరుగుతున్నట్టు తెలిపారు. అమృత్ పథకం కింద 73 పైగా స్టేషన్లను ఆధునికరణ పనులు చేపట్టబోతున్నట్టు తెలిపారు. అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా లెవల్ క్రాసింగ్ దగ్గర అండర్ పాస్ లు, రైల్వే ఓవర్ బ్రిడ్జిలు నిర్మించిన విషయాన్ని ప్రస్తావించారు. అంతేకాదు ఏపీ అభివృద్దికి కేంద్రం కట్టుబడి ఉందన్నారు.

ఇదీ చదవండి: ఆ తరంలో NTR, కృష్ణంరాజు.. ఈ జనరేషన్ లో రాజశేఖర్, ప్రభాస్ లకే ఆ క్రెడిట్ దక్కింది..

ఇదీ చదవండి: ‘కల్కి ’ సినిమాలో నాగ్ అశ్విన్ చేసిన ఈ బ్లండర్ మిస్టేక్ ను గుర్తించారా..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More