Home> ఏపీ
Advertisement

Polavaram Project: వరద సమయంలోనూ శరవేగంగా సాగుతున్న పోలవరం పనులు

Polavaram Project: పోలవరం ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వరద సమయంలో సైతం పనులకు ఆటంకం ఏర్పడటం లేదు. పోలవరం పనుల తీరుపై ప్రాజెక్టు అథారిటీ సంతృప్తి వ్యక్తం చేసింది. 
 

Polavaram Project: వరద సమయంలోనూ శరవేగంగా సాగుతున్న పోలవరం పనులు

Polavaram Project: పోలవరం ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వరద సమయంలో సైతం పనులకు ఆటంకం ఏర్పడటం లేదు. పోలవరం పనుల తీరుపై ప్రాజెక్టు అథారిటీ సంతృప్తి వ్యక్తం చేసింది. 

ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనరేఖ అయిన పోలవరం ప్రాజెక్టు పనులు(Polavaram Project Works) వరద సమయంలో సైతం ఏ మాత్రం ఆటంకం లేకుండా శరవేగంగా జరుగుతున్నాయి. పోలవరంలో జరుగుతున్న ప్రాజెక్టు పనుల్ని పరిశీలించిన పోలవరం ప్రాజెక్టు అథారిటీ సంతృప్తి వ్యక్తం చేసింది. దిగువ కాపర్ డ్యామ్ పనుల్ని మరింత వేగవంతం చేయాలని సూచించింది. నిర్వాసితులకు పునరావాసంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించింది. పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే,ఎగువ,దిగువ కాపడ్ డ్యామ్‌లు, ఎర్త్ కమ్ రాక్‌ఫిల్ డ్యామ్(Earth cum Rockfill Dam), విద్యుత్ ఉత్పత్తి కేంద్రం పనుల్ని పీపీఏ క్షేత్రస్థాయిలో పరిశీలించింది. 

గోదావరి వరద సమయంలో సైతం ఎగువ కాపర్ డ్యామ్ పనుల్ని వేగంగా చేపట్టడంపై పోలవరం ప్రాజెక్టు అథారిటీ(Polavaram project Authority) సంతృప్తి వ్యక్తం చేసింది. దిగువ కాపర్ డ్యామ్ పనుల్ని నెలాఖరులోగా రక్షితస్థాయికి పూర్తి చేయాలని ఆదేశించింది.డయాఫ్రమ్ వాల్ పటిష్టతను మరోసారి పరిశీలించాలని కోరింది. కేంద్ర జలసంఘం డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానెల్ మార్గదర్శకాల ప్రకారం కాపర్ డ్యామ్‌ల మద్య నదీగర్భంలో ఖాళీ ప్రదేశాన్ని వైబ్రో కాంపక్షన్ విధానంలో అభివృద్ధి చేసి..ఈసీఆర్ఎఫ్ పనుల్ని పూర్తి చేయాల్సిందిగా ఆదేశించింది. మరోవైపు పోలవరం ఆర్ అండ్ ఆర్(Polavaram R&R) విషయంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖలోని జాతీయ పర్యవేక్షణ కమిటీ ఇవాళ సమావేశం కానుంది. పునరావాసం, పరిహారం అంశాల్ని ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించనున్నారు. 

Also read: Kodali Nani: నాడే చంద్రబాబును అంతం చేసి ఉండాల్సింది

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Read More