Home> ఏపీ
Advertisement

Pithapuram: పిఠాపురంలో ఎమ్మెల్యేగా గెలిచిన జనసేన అధినేత.. పవన్‌ కల్యాణ్‌ అనే నేను

Pawan Kalyan Won As MLA From Pithapuram: ఏపీ ఎన్నికల్లో కూటమి ప్రభంజనం సృష్టించగా.. ఆ ప్రభంజనంలో పిఠాపురంలో జనసన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ విజయం సాధించారు.

Pithapuram: పిఠాపురంలో ఎమ్మెల్యేగా గెలిచిన జనసేన అధినేత.. పవన్‌ కల్యాణ్‌ అనే నేను

Pithapuram Election Results: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో అందరి దృష్టి ఆకర్షించిన పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ విజయం సాధించారు. గత ఎన్నికల్లో రెండు చోట్ల ఓటమిని చవిచూసిన పవన్‌ ఈసారి గెలుపు కోసం తీవ్రంగా శ్రమించారు. తెలుగుదేశం, బీజేపీతో కలిసి పోటీ చేయడంతో పవన్‌ విజయం సునాయాసంగా సాగింది. తొలి రౌండ్‌ నుంచి పవన్‌ ఆధిక్యం కనబరుస్తూ ఆఖరికి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

Also Read: AP Election Results: జగన్‌ దారుణ ఓటమికి కారణాలు ఇవే.. అవే చావుదెబ్బ తీశాయా?

కాపు సామాజికవర్గం అత్యధికంగా ఉండే పిఠాపురం నియోజకవర్గం నుంచి వ్యూహాత్మకంగా పవన్‌ కల్యాణ్‌ పోటీ చేశారు. సినీ రంగ ప్రముఖులతోపాటు సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు భారీగా ప్రచారం చేశారు. తన ప్రత్యర్థి వంగా గీతపై పవన్‌ సత్తా చాటారు. రాష్ట్రవ్యాప్తంగా వెలువడిన కూటమి ప్రభంజనంలో పవర్‌ స్టార్‌ పిఠాపురాన్ని కైవసం చేసుకున్నారు. రౌండ్‌ రౌండ్‌కు తన ఆధిక్యం పెంచుకుంటూ వెళ్లిన పవన్‌ కల్యాణ్‌ 70,384 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. అయితే వంగా గీతను గెలిపిస్తే హోంమంత్రి ఇస్తానని చెప్పినా కూడా పిఠాపురం వాసులు జగన్‌ను గెలిపించలేకపోయారు.

Also Read: YS Jagan Viral Tweet: ఎన్నికల ఫలితాల ముందు సీఎం వైఎస్‌ జగన్‌ సంచలన ట్వీట్‌..

 

పొత్తులో భాగంగా 21 స్థానాల్లో పోటీ చేసిన జనసేన పార్టీ 20 స్థానాల్లో సత్తా చాటింది. దాదాపు అన్ని స్థానాల్లో గాజు గ్లాస్‌ జయకేతనం ఎగురవేసింది. ఈ క్రమంలోనే పిఠాపురంలో పోటీ చేసిన జనసేన పార్టీ తరఫున పవన్‌ కల్యాణ్‌ విజయం సాధించారు. పవన్‌ గెలుపుతో జనసైనికులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇక కూటమి ప్రభుత్వంలో పవన్‌ కల్యాణ్‌ కీలక పాత్ర పోషిస్తారని భావిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి పదవి లేదా మరి ఇంకేదైనా పదవి లభిస్తుందనే ఆశలో పవన్‌ అభిమానులు ఉన్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter

Read More