Home> ఏపీ
Advertisement

సీఎం అవుతున్నా.. ప్రమాణస్వీకారం చేస్తా: పవన్ కల్యాణ్

నూజివీడు సభలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన పవన్ కల్యాణ్

సీఎం అవుతున్నా.. ప్రమాణస్వీకారం చేస్తా: పవన్ కల్యాణ్

నూజివీడు: కృష్ణా జిల్లా నూజివీడులో నేడు ఎన్నికల ప్రచారం నిర్వహించిన పవన్ కల్యాణ్.. తన ప్రచారంలో భాగంగా ఏపీ అధికార పార్టీ టీడిపి, ప్రతిపక్ష పార్టీ జనసేనలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. నూజివీడు సభలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ ''25 కిలోల బియ్యం, రూ. 2500 ఇవ్వడానికి రాజకీయాల్లోకి రాలేదు.. మీకు 25 సంవత్సరాల భవిష్యత్తు, మీ పిల్లల భవిష్యత్తు ఇవ్వడానికే రాజకీయాల్లోకి వచ్చాను'' అని అన్నారు. ఈ సందర్భంగా సభకు హాజరైన కార్యకర్తలు సీఎం సీఎం అని నినాదాలు చేయడంపై పవన్ స్పందిస్తూ... మనమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం అని, తానే సీఎం అవబోతున్నానని ధీమా వ్యక్తం చేశారు. సీఎం సీఎం అనే పదం బలమైన పదం అని, అది విశ్వాన్ని తాకితీరుతుందని చెప్పి కార్యకర్తల్లో మరింత జోష్ నింపే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా ఏపీ రాజధాని ప్రాంతాలను పరిశీలించే క్రమంలో నూజివీడు పేరు కూడా వినిపించిందని, కానీ తెలుగు దేశం పార్టీ నూజివీడును మోసం చేసి అమరావతిని రాజధానిని చేశారని అన్నారు. జనసేన పార్టీ అధికారంలోకొస్తే, నూజివీడును అద్భుతంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు.

ఏపీలో వైఎస్సార్సీపీని గెలిపిస్తే టీఆర్ఎస్‌ను గెలిపించినట్లేనని... సంక్షేమ పథకాలకు చంద్రన్న, జగనన్న పేర్లు ఎందుకని ప్రశ్నించారు. తమ పార్టీ అధికారంలోకొస్తే, సంక్షేమ పథకాలకు పొట్టి శ్రీరాములు, అంబేద్కర్‌ పేర్లు పెడతాం అని పవన్ ప్రకటించారు.

Read More