Home> ఏపీ
Advertisement

Pawan Kalyan About Chandrababu Arrest: చంద్రబాబు అరెస్ట్‌పై పవన్ కళ్యాణ్ ఫైర్.. సీఎం జగన్ పై ఘాటు వ్యాఖ్యలు

Pawan Kalyan About Chandrababu Arrest And AP CM YS Jagan : అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ పోలీసులు అదుపులోకి తీసుకోవడానికి కొద్దిసేపటి ముందు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అనుమంచిపల్లి దగ్గర మీడియాతో మాట్లాడారు. ఆ వివరాలు..

Pawan Kalyan About Chandrababu Arrest: చంద్రబాబు అరెస్ట్‌పై పవన్ కళ్యాణ్ ఫైర్.. సీఎం జగన్ పై ఘాటు వ్యాఖ్యలు

Pawan Kalyan About Chandrababu Arrest And AP CM YS Jagan : ఆంధ్ర ప్రదేశ్ పోలీసులు అదుపులోకి తీసుకోవడానికి కొద్దిసేపటి ముందు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అనుమంచిపల్లి దగ్గర మీడియాతో మాట్లాడారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

చంద్రబాబు నాయుడుని అరెస్టు చేస్తారని మేమేమీ ముందుగా ఊహించలేదు. వారాహి యాత్ర తదుపరి షెడ్యూల్ కోసం మేము రేపు ఓ కార్యక్రమానికి ప్లాన్ చేసుకున్నాం. అందులో భాగంగానే ఏపీకి బయల్దేరాను. కానీ తనను మార్గం మధ్యలోనే పోలీసులు ఆపేశారు అని పవన్ కళ్యాణ్ స్పష్టంచేశారు. 
తనను ఆపితే పోలీసులకి ఒకటే చెప్పా.. బెయిల్ మీద ఈ ముఖ్యమంత్రి బయట ఉన్నాడు. ఎంతసేపూ ఆ ముఖ్యమంత్రి జైలు గురించే ఆలోచిస్తాడు.
అందర్నీ జైలుకి ఎలా పంపాలా అనే ఆలోచిస్తాడు. అతనో క్రిమినల్. విదేశాలకు వెళ్లాలన్నా కోర్టు అనుమతి తీసుకోవాలి. అలాంటి వాడి చేతిలో అధికారం ఉంది అది దురదృష్టం అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. బెయిల్ మీద బయటకెళ్లే వాడికి  ఎంతసేపూ అరెస్టులు చేయాలనే ఆలోచనలే ఉన్నాయి. తను క్రిమినల్ అయితే అందరూ క్రిమినల్స్  అవ్వాలని కోరుకుంటాడు. దీనికంతటికీ అదే అసలు కారణం అని పవన్ కళ్యాణ్ తీవ్ర అసహనం వ్యక్తంచేశారు.

చంద్రబాబు నాయుడిని కలుస్తానని ఎలా ఊహిస్తారు. కోర్టు ప్రాంగణంలోకి వెళ్లడానికి ఎవరు అనుమతిస్తారు. ఆంధ్రప్రదేశ్ రావడానికి రాష్ట్ర ప్రభుత్వం వీసా కావాలి అంటుందేమో?. కారణాలు చెప్పడం లేదు.  రాకూడదు అంటున్నారు. రౌడీలు, గూండాలకు అధికారం ఇస్తే ఇలాగే ఉంటుంది. ట్రాఫిక్ అగిపోయింది. చాలా మంది బాధ పడుతున్నారు. ఫ్లయిట్ లో వెళ్తానంటే ఎక్కనివ్వలేదు. కారులో వెళ్తామంటే అనుమతివ్వడం లేదు. నడిచి వెళ్తామన్నా అనుమతి ఇవ్వడం లేదు. విశాఖలో కూడా ఇలాగే చేశారు. ఏం చేయాలి... గూండాలు, దోపిడి చేసే వారికి అధికారం ఇస్తే ఇలాగే ఉంటుంది అనే విషయం అందరికీ అర్ధం అవుతోంది అంటూ ఏపీ సర్కారుపై పవన్ కళ్యాణ్ నేరుగానే తన అసహనాన్ని వెళ్లగక్కారు.

ఇది కూడా చదవండి : Chandrababu CID investigation exclusive video: చంద్రబాబు సీఐడీ విచారణ దృశ్యాలు ఎక్స్‌క్లూజీవ్ వీడియో
ఒకపక్క జాతీయ స్థాయిలో జీ 20 సమ్మిట్ జరుగుతోంది, దేశానికి చాలా ప్రతిష్టాత్మక సమ్మిట్ జరుగుతోంది. జీ20 దేశాల ప్రతినిధులు వస్తున్నప్పుడు ఇలాంటి పని చేయడం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్ఫూర్తికి మచ్చ. ప్రధాన మంత్రి చాలా కష్టపడి తీసుకువస్తే అన్ని రాష్ట్రాలు సహకరించాలి. దురదృష్టం ఏమిటంటే గూండాలకి అధికారం ఇస్తే జీ 20 తాలూకు విశిష్టత వారికి ఏమర్ధమవుతుంది. పోలీసులు కో ఆపరేట్ చేయమని ఆపేశారు తప్ప ఏమీ చెప్పలేదు అని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. 

ఇది కూడా చదవండి : Will Chandrababu Naidu gets Bail or Not ? చంద్రబాబుకు బెయిల్ వచ్చే అవకాశం ఉందా ? లేదా ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Read More