Home> ఏపీ
Advertisement

Ganesh Chaturthi: వినాయక చవితిపై పవన్‌ కల్యాణ్‌ కీలక ప్రకటన.. పిఠాపురం నుంచే శ్రీకారం

Pawan Kalyan Calls Eco Friendly Vinayaka Chavithi: కొన్ని వారాల్లో వినాయక చవితి వేడుకలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ కీలక ప్రకటన చేశారు. ఎలా పూజించాలో వివరించారు.

Ganesh Chaturthi: వినాయక చవితిపై పవన్‌ కల్యాణ్‌ కీలక ప్రకటన.. పిఠాపురం నుంచే శ్రీకారం

Pawan Kalyan: రానున్న వినాయక చవితి ఉత్సవాలు ఎలా చేసుకోవాలో ఉప ముఖ్యమంత్రి  పవన్ కల్యాణ్ తెలిపారు. పర్యావరణ, అటవీ శాఖ మంత్రిగా ఉన్న పవన్‌ కల్యాణ్‌ను మంగళగిరిలో ప్రకృతి వ్యవసాయ నిపుణుడు, పర్యావరణ ప్రేమికుడు  విజయ రామ్ కలిశారు. పర్యావరణ విషయాలపై తన అధ్యయనాన్ని పవన్‌కు వివరించారు. పర్యావరణానికి హాని చేయని వస్తువుల వినియోగాన్ని పెంచేందుకు, ప్లాస్టిక్ వాడకం తగ్గించేందుకు తన సూచనలు చేశారు. ఈ సందర్భంగా ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన గోవింద భోగ్, రత్న చోడి, మాప్పిల్లై సాంబ తదితర బియ్యం రకాలను పవన్‌కు చూపించారు. 

Also Read: YS Jagan Save A Life: నిండు ప్రాణం కాపాడిన మాజీ సీఎం వైఎస్‌ జగన్.. తన కాన్వాయ్‌లో

 

అనంతరం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. పర్యావరణహితమైన వస్తువుల వాడకాన్ని మనం చేసుకునే ఉత్సవాల్లో వాడితే మేలు కలుగుతుందని పేర్కొన్నారు. వినాయక చవితి వేడుకల్లో మట్టి గణపతి ప్రతిమలను పూజిస్తే పర్యావరణానికి ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. మట్టి విగ్రహాలతో జల కాలుష్యం అరికట్టవచ్చని గుర్తుచేశారు. మట్టి గణపతికి పూజలపై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు ఆదేశించారు.

Also Read: Big Breaking: ఆంధ్రప్రదేశ్‌లో అర్ధరాత్రి కలకలం.. ప్రభుత్వ కీలక పత్రాలు దగ్ధం

 

మట్టి విగ్రహాల పూజించడంపై తన పిఠాపురం నియోజకవర్గం నుంచే ప్రారంభిద్దామని డిప్యూటీ సీఎం పవన్‌ సూచించారు. మట్టితో చేసిన వినాయక విగ్రహాలు పూజించేందుకు పిఠాపురం నియోజకవర్గంలో తగిన ఏర్పాట్లు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఆలయాల్లో ప్రసాదాల విక్రయాలు బటర్ పేపర్‌లో కాకుండా చిన్నపాటి తాటాకు బుట్టలు, ఆకులతో చేసిన దొన్నెలు వాడాలని పవన్‌ సూచించారు. ఇలా చేస్తే వ్యర్థాల నిర్వహణ కూడా సులభమని పేర్కొన్నారు. వీటి వినియోగాన్ని పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న ఆలయాల్లో ప్రయోగాత్మకంగా చేపట్టేందుకు కార్యాచరణ రూపొందించనున్నట్లు పవన్‌ కల్యాణ్ తెలిపారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Read More